NTV Telugu Site icon

Ranjith Reddy: అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం..

Ranjit Reddy

Ranjit Reddy

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పేట్ మండలం కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్ షో కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఏజ్ఆర్ గార్డెన్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సమావేశంలో పాల్గొన్నారు.

Pushpa 2 : పుష్ప 2 క్రేజీ అప్డేట్ వచ్చేస్తుంది .. ఫ్యాన్స్ రెడీ అవండమ్మా..

ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడిలా ఇంటింట ప్రచారం చేస్తూ, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.500 కోట్లు మంజూరయ్యాయని ఆయన చెప్పారు. మహిళల సంక్షేమం కోసం పెద్దపీట వేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.

Kota: కోట సూసైడ్ ఫ్యాక్టరీగా ఎందుకు మారుతోంది..? మరో ఇద్దరు విద్యార్థులు మృతి

ఆగస్టు 15వ తేదీ లోపు రైతులకు రూ.2 లక్షల రూపాయలు రుణమాఫీ, మిగిలిన అన్ని గ్యారెంటీలను హామీలను అమలు చేస్తామని రంజిత్ రెడ్డి చెప్పారు. కాగా.. బీజేపీకి ఓటు వేస్తే రాజ్యాంగాన్ని, రిజర్వేషన్ రద్దు చేస్తారని తెలిపారు. బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని చెప్పి దేశంలోని ప్రజలను మోసం చేసారని పేర్కొన్నారు.
రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ఓట్లు వేసి తనను ఎంపీగా గెలిపించాలని రంజిత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.