V.Hanumantha Rao: దేశానికి ఓబీసీ ప్రధాని అయితే అందరం సంతోష పడ్డామని.. కానీ 8 ఏళ్లలో ఒక పని కూడా చేయలేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు విమర్శించారు. మండల కమిషన్ సిఫార్సు ముందుకు దాటట్లేదని ఆయన అన్నారు. క్రిమిలేయర్ ఎత్తేయాలని ఓబీసీ పార్లమెంట్ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని.. కానీ ఇంత వరకు తీసేయలేదన్నారు. మంత్రి వర్గంలో ఓబీసీ శాఖ పెట్టాలని చెప్పామన్నారు. జనగణనలో కుల గణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇచ్చినా తాము ఒప్పుకున్నామని.. మరి ఓబీసీ సంగతేంటని ప్రశ్నించారు. ఓబీసీలో వందల కులాలు ఉన్నాయన్నారు. మండలి కమిషన్ను ఏర్పాటు చేసింది పీవీ నరసింహారావు అని ఆయన అన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఓబీసీపై చర్చించాలని.. మోడీ ఇప్పటి వరకు ఓబీసీలకు ఏం చేశారో చెప్పాలని వీహెచ్ డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీని నిలదీయడానికి అన్ని రాజకీయ పార్టీలను ఏకంచేస్తామని ఆయన అన్నారు.
Kodanda Reddy: తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది..
బీసీలకు యూపీఏనే చేసింది.. ఎన్డీఏ ఏం చేసిందో చెప్పాలన్నారు. బీసీల సంఖ్య పెరిగిందన్న ఆయన.. బీసీల రిజర్వేషన్లు కూడా పెంచాలన్నారు. తమ పార్టీలో కూడా ఈ విషయంపై చర్చిస్తామన్నారు. ఓబీసీలకు ఇంకా 27 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని.. ఓబీసీల ఓట్లతో ముఖ్యమంత్రి, ప్రధాని అవుతారు కానీ రిజర్వేషన్లు ఎందుకు పెంచరని ప్రశ్నించారు. టీడీపీ 7 సంవత్సరాల్లో కనిపించలేదన్న ఆయన.. ఇప్పుడు బీసీలకు మేమే చేశామని వస్తున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నిటి కోసం ఢిల్లీ వెళ్లి అన్ని రాజకీయ పార్టీలను కలుస్తానని ఆయన తెలిపారు. మునుగోడు సమీక్ష కావాలని అడిగినం ఇంత వరకు పెట్టలేదన్నారు. కలిసి పని చేయడానికి తాను కూడా సీనియర్ల కాళ్ళు మొక్కుతా కలిసి పని చేద్దామన్నారు. పార్టీలో ఎలాంటి గొడవలు లేవన్నారు.