కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్లోకి అడుగు పెట్టింది. షెడ్యూల్లో ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు చేరకున్న జోడో యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై వెనక నుంచి దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. ఇక, రాహుల్ గాంధీ వ్యక్తిగత సిబ్బంది తేరుకునే లోపే ఈ దాడి జరిగిందని స్థానికులు తెలిపారు.
Read Also: Virat Kohli Brother: తల్లి అనారోగ్యంపై క్లారిటీ ఇచ్చిన విరాట్ కోహ్లీ సోదరుడు!
అయితే, ఈ దాడిలో కారు యొక్క అద్దం పూర్తిగా ధ్వంసమైంది. దాడి అనంతరం రాహుల్ గాంధీతో పాటు పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి కూడా కారులో నుంచి కిందకు దిగారు. అయితే, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మేము ప్రయాణిస్తున్న కారుపై వెనుక నుంచి దాడి చేసినట్లు చెప్పారు. ఇక, ఈ దాడి తర్వాత రాహుల్ గాంధీ కారులోంచి దిగి బస్సులో కూర్చున్నారు. ఇక, ప్రజలను కాంగ్రెస్ నేతలు శాంతింపజేశారు. ఆ తర్వాత తిరిగి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రధాన రహదారుల గుండా నెమ్మదిగా సాగుతుంది. కారు పైకప్పుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ రాహుల్ గాంధీ ముందుకు సాగారు. రహదారి వెంబడి ఉన్న ప్రజలతో మాట్లాడుతూ వెళ్తున్నారు. ఇక, రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఆయన యాత్రలో వరుసగా భద్రత లోపం కనిపిస్తుంది.