Mexico: ఒక వ్యక్తి మొసలిని పెళ్లి చేసుకున్నాడు..అవునండి ఇది నిజం. మళ్లీ ఆయనేం సాధారణ వ్యక్తి కాదు. ఒక నగరానికి మేయర్..ఏంటి నమ్మడం లేదా.. వీడికేం పోయేకాలం అనుకుంటున్నారా… మేయర్ విక్టర్ హ్యూగో సోసా మొసలిని వధువుగా మార్చి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి కారణం వింటే తల పట్టుకుంటారు. మేయర్ విక్టర్ హ్యూగో సోసా వివాహానికి సంబంధించిన వీడియోను ప్రజలు సోషల్ మీడియాలో తీవ్రంగా షేర్ చేస్తున్నారు. మొసలిని పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఈసారి మంచి పంట పండాలని, ప్రశాంత వాతావరణం నెలకొనేలా విక్టర్ హ్యూగో ఈ వివాహాన్ని రూపొందించారు.
Read Also:Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
పంట, ప్రజా శ్రేయస్సు కోసం వారి ఆచారంలో మొసళ్ళను, ఇతర సరీసృపాలను వివాహం చేసుకుంటారట. వీరి వివాహానికి కూడా చాలా మంది హాజరయ్యారు. పెళ్లిలో వధూవరుల సంప్రదాయాలన్నీ కూడా పాటించారు. మొసలితో పెళ్లి చేసుకున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడానికి కారణం ఇదే. వివాహ సమయంలో మేయర్ మాట్లాడుతూ, ‘నేను బాధ్యతను స్వీకరిస్తున్నాను. మేము ఒకరిని ఒకరము ప్రేమించుకుంటున్నాము. అదే ముఖ్యం. మీరు ప్రేమ లేకుండా వివాహం చేసుకోలేరు. నేను యువరాణి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను’ అని పేర్కొన్నారు.
Read Also:Vijay Devarakonda: ‘డియర్ కామ్రేడ్’ లుక్ లో విజయ్.. ఇంకో ట్విస్ట్ ఏం ఇవ్వడం లేదు కదా
ఈ పట్టణంలో 230 ఏళ్లుగా ఇలాంటి పెళ్లి సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఊరిలో ఒక మగ, ఆడ మొసలికి పెళ్లయి 230 ఏళ్లు అవుతోంది. ఇది రెండు స్వదేశీ సమూహాలు వివాహంతో శాంతిని ప్రకటించిన రోజును సూచిస్తుంది. కమ్యూనిటీలను భూమికి అనుసంధానం చేసి, మంచి పంట పండాలని కోరుకునేలా ఈ పెళ్లి జరుగుతుంది. వివాహ వేడుకకు ముందు, ఆడ మొసలిని అలంకరించడానికి స్థానిక గృహాలకు తీసుకువెళతారు.’వధువు’ పెళ్లి దుస్తులను ధరిస్తుంది, రక్షణ కోసం ఆమె నోరు కట్టేస్తారు. పెళ్లి తర్వాత మేయర్ ‘పెళ్లికూతురు’తో కలిసి డ్యాన్స్ చేసి ముద్దులు పెట్టాడు.