Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Congress Government Is Continuously Going Ahead In Corruption Prime Minister Modi Who Criticized Severely

PM Modi: కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అవినీతిలో ముందుకెళ్తోంది.. ప్రధాని తీవ్ర విమర్శలు

Published Date :September 14, 2023 , 6:05 pm
By Rajesh Veeramalla
PM Modi: కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అవినీతిలో ముందుకెళ్తోంది.. ప్రధాని తీవ్ర విమర్శలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం లేకపోవడంతో ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ఉచిత ఇళ్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ అనుమతించలేదని ప్రధాని మోడీ అన్నారు. పేదలకు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉండొచ్చు కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లలో చాలా ముందుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల రికార్డులన్నీ బద్దలు కొట్టిందని.. ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా పనిచేస్తోందని ఆరోపించారు. చాలా కాలం తర్వాత అధికారంలో అవకాశం వచ్చిందని, వీలయినంత దోచుకున్నామని, ఆ తర్వాత అవకాశం రాకపోవచ్చునని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు.

Health Department: రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధులపై వైద్యారోగ్య శాఖ సమీక్ష

ఛత్తీస్‌గఢ్ దేశ అభివృద్ధికి పవర్ హౌస్ లాంటిదని ప్రధాని మోడీ అన్నారు. పవర్ హౌస్‌లు తమ పూర్తి శక్తితో పనిచేసినప్పుడే దేశం ముందుకు సాగే శక్తి వస్తుందని తెలిపారు. ఈ ఆలోచనతో గత 9 ఏళ్లలో ఛత్తీస్‌గఢ్ బహుముఖ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని పేర్కొన్నారు. ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రం ప్రతి రంగంలోనూ పెద్ద పథకాలను పూర్తిచేస్తోందని, కొత్త ప్రాజెక్టులకు పునాది వేస్తోందని చెప్పారు. మరోవైపు రాయ్‌ఘర్ జిల్లా కార్యక్రమంలో.. సుమారు 6350 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. ఈరోజు ఛత్తీస్‌గఢ్‌కు రూ.6400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కానుకగా లభిస్తున్నాయని మోడీ అన్నారు. మరోవైపు ప్రధాని పర్యటనలో భాగంగా.. సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను పంపిణీ చేశారు. నేడు ప్రపంచం మొత్తం ఆధునిక అభివృద్ధి, పేద సంక్షేమం యొక్క వేగవంతమైన భారతీయ నమూనాను చూస్తోందని.. అభినందిస్తోందని తెలిపారు.

Parliament Special Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశానికి ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్

ఇదిలా ఉంటే.. గత రెండున్నర నెలల్లో ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని మోడీ పర్యటించడం ఇది రెండోసారి. ఈ ఏడాది చివర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి దశ పరివర్తన్ యాత్రను మంగళవారం దంతెవాడ జిల్లా నుంచి ప్రారంభించింది. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం జష్‌పూర్ నుంచి రెండో దశ యాత్రను ప్రారంభించనున్నారు. బిలాస్‌పూర్‌లో జరిగే రెండు పరివర్తన్ యాత్రల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bjp
  • Chhattisgarh
  • congress
  • modi
  • telugu news

తాజావార్తలు

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

  • Rajasekhar: శ్రీలీల కండిషన్.. రాజశేఖర్ షాక్! డాక్టర్ల మధ్య ‘మెడికల్’ ఒప్పందం వెనుక అసలు కథ ఇదే!

  • Off The Record: భోగాపురానికి దారేది.. కేంద్ర మంత్రి మీద గుస్సా అవుతున్న కమలం ఎమ్మెల్యే!

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions