హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్‌కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను బట్టి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. 2047 వరకు బీజేపీ పాలన సాగుతుందని ఎగ్జిట్ పోల్‌లోనే చెప్పినట్లు బడోలి పేర్కొన్నారు. ఈ విధానాలకు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ విజయం పట్ల పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యకర్తల శ్రమ ఫలించిందని అన్నారు.
Read Also: Omar Abdullah: జమ్మూకాశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా! ఎన్సీ కూటమి చర్చలు
చాలా ఎగ్జిట్ పోల్స్‌లో హర్యానా ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా వెల్లడయ్యాయి. హర్యానాలో బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ మార్కును దాటి.. 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అవుట్‌గోయింగ్ అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. (ఇందులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆడమ్‌పూర్ సీటు కూడా ఉంది), కాంగ్రెస్‌కు 28, జేజేపీకి ఆరుగురు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ, ఐఎన్‌ఎల్‌డికి ఒక్కొక్కరు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు ఉండగా తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు.. 2019 కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా తన సీటును కాపాడుకోలేకపోయాడు.
Read Also: CM Chandrababu: కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ