Site icon NTV Telugu

TG Congress: బీసీ కులగణనపై కాంగ్రెస్ ఫోకస్.. నేడు గాంధీభవన్‌లో కీలక సమావేశం

Congress

Congress

TG Congress: ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇవాళ గాంధీ భవన్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్‌ ఛైర్మన్‌లతో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు హాజరు కానున్నారు. కులగణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. క్షేత్ర స్థాయిలో కుల గణనపై చర్చకు అధికార పార్టీ కసరత్తు చేయనుంది. ఈ కీలక సమావేశం నేపథ్యంలో గాంధీభవన్‌లో ఇవాళ జరగనున్న ప్రజావాణి వాయిదా పడింది.

Read Also: Kishan Reddy : ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖాళీగా ఉండకూడదనేదే ప్రధాని మోడీ లక్ష్యం

Exit mobile version