Site icon NTV Telugu

CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం ఇవాళ న్యూఢిల్లీలో జరుగుతుంది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి, దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన జనగణన అంశాలపై ఈ భేటీలో చర్చలు జరుగనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌ తదితరులు సమావేశానికి హాజరవుతారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా హాజరయ్యేలా పార్టీ హైకమాండ్ సూచనలు ఇచ్చింది.

Simhachalam Incident: కమీషన్ ప్రశ్నల వర్షం.. సమాధానం ఇవ్వని ఈఓ సుబ్బారావు!

ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మాట్లాడనున్నారని సమాచారం. సీడబ్ల్యూసీ సమావేశం పార్టీకి వ్యూహాత్మక దిశను ఇవ్వనుంది. పహల్గామ్ దాడిపై కేంద్రం స్పందనపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని స్పష్టంగా చెబుతుందని తెలుస్తోంది. భద్రతా పరిస్థితులపై పార్టీ దృష్టిని తెలియజేయనుంది.

India Pakistan: బంగ్లాదేశ్‌లో పాక్ సైనిక అధికారులు.. బంగ్లా, మయన్మార్ సరిహద్దుల్లో హై అలర్ట్..

Exit mobile version