Venkatesh Maha: C/o కంచరపాలెం సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ వెంకటేష్ మహా. ఇక ప్రస్తుతం నటుడిగా, నిర్మాతగా బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ కు వివాదాల్లో ఇరుక్కోవడం అలవాటుగా మారిపోయింది. గతంలో కేజీఎఫ్ సినిమాపై నోరుపారేసుకుని ట్రోలింగ్ కు గురి అయ్యాడు. ఇక ఆ విషయం పెద్దది కావడంతో అప్పుడు క్షమాపణ కూడా చెప్పడానికి ప్రయత్నించగా విషయం సద్దుమణిగింది. ఇక ఈ మధ్యనే ప్రభాస్ సినిమా సలార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి మరోసారి వివాదంలో ఇరుక్కున్నాడు.
డంకీ సినిమా సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. తొలి రోజు మొదటి ఆట చూడాలని వేచి చూస్తున్నాను. నా అభిమాన నటుడు షారుక్ ఖాన్, నా అభిమాన దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో వస్తుండటం ఆనందంగా ఉంది..డంకీ సినిమా సెన్సార్ బోర్డు స్క్రీన్ సమయంలో చూసిన అధికారులు లేని నిలబడి చప్పట్లు కొట్టారనే విషయం నాకు మరింత ఆనందం కలుగజేసింది. ఇదే నిజమైతే.. సినీ ప్రేక్షకులకు ఈ సినిమా భావోద్వేగాలను పంచుతుందని అనుకొంటున్నాను” అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ ప్రభాస్ ఫ్యాన్స్ కు చిర్రెత్తేలా చేసింది. మామూలుగానే డార్లింగ్ సినిమాను ఏదైనా ఉంటే ఫ్యాన్స్ ఊరుకోరు.. అలాంటింది ఈ సినిమా వదిలేసి వేరే సినిమాను పొగిడితే ఊరుకుంటారా.. ? ఇచ్చి పడేశారు. దీంతో వెంకటేష్ మహా ట్విట్టర్ కు గుడ్ బై చెప్పాడు. దాదాపు ఒక వారం తరువాత ఈరోజే మళ్లీ ట్విట్టర్ లో అడుగుపెట్టాడు ఈ డైరెక్టర్. తన సినిమా C/o కంచరపాలెం .. IMDB టాప్ 250 రేటెడ్ మూవీస్ లో 14వ స్థానంలో నిలిచిందని చెప్తూ ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్ చూసి.. అన్న.. మళ్లొచ్చినాడు.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈసారి ట్రోలింగ్ ఎలా ఉంటుందో చూడాలి.