NTV Telugu Site icon

Bharat Jodo Nyay Yatra: అస్సాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి..

Bjp

Bjp

కాంగ్రెస్ అగ్రనేత చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఈ యాత్రలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ్న్నారు. కాగా.. ఈ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ కార్యకర్తలు మరోసారి దాడి చేశారంటూ ఆరోపిస్తున్నారు. కాగా.. శనివారం కూడా బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడికి పాల్పడింది. ఆ దాడిని కాంగ్రెస్ ఖండించింది. అధికార పార్టీ బీజేపీ.. దేశ ప్రజలకు ఇచ్చిన ప్రతి హక్కును ‘అణచివేస్తోందని’ ఆరోపించింది. రాజ్యాంగాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలను, నాయకులను బెదిరించే ఇలాంటి వ్యూహాలకు కాంగ్రెస్ భయపడబోదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Ayodhya security: 13,000 మంది భద్రతా, బాంబ్ స్క్వాడ్స్, ఏటీఎస్.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం..

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె. సి.వేణుగోపాల్ ఈ దాడికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ, “అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి హిమంత ‘భారత్ జోడో న్యాయ యాత్ర’కి ఎంత భయపడుతున్నారో ఇంతకంటే రుజువు ఏమి కావాలి? చూడండి, వారి గూండాలు మన కాంగ్రెస్ పోస్టర్లను చించి వాహనాలను ధ్వంసం చేస్తున్నారు. అని సోషల్ మీడియాలో తెలిపారు. యాత్ర విస్తృత ప్రభావం కారణంగా హిమంత బిశ్వశర్మ చాలా కలత చెందాడు. అతను ఏ స్థాయికి దిగజారాడు చూడండని ఆరోపించారు.

Uttam Kumar Reddy : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సర్పంచ్, ఎంపీటీసీ జడ్పీటీసీల హక్కులను హరించింది

భారత్ జోడో న్యాయ్ యాత్రకు వస్తున్న భారీ ఆదరణతో బీజేపీ ఉలిక్కిపడుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అసోంలోని లఖింపూర్‌లో కాంగ్రెస్ పార్టీ వాహనాలను ధ్వంసం చేయడం, యాత్ర పోస్టర్లు చింపివేయడం.. ఇది బీజేపీ ఆగ్రహాన్ని తెలియజేస్తోందని తెలిపారు. ఈ క్రమంలో.. లఖింపూర్ హింసాత్మక ఘటనపై కాంగ్రెస్ పార్టీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాగా.. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర అస్సాంలో నాల్గవ రోజు కొనసాగుతోంది. ఈ రోజు అరుణాచల్ ప్రదేశ్‌లోకి ఈ యాత్ర ప్రవేశించనుంది.