killed 52 civilians in Congo: కాంగోలో ఊచకోత.. నిద్రపోతున్న ప్రజలను లేపి.. గొడ్డళ్లతో నరికి చంపేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
killed 52 civilians in Congo: ఆఫ్రికా దేశమైన కాంగోలో తిరుగుబాటుదారులు పౌరులపై ఊచకోతకు దిగారు. ఈసందర్భంగా స్థానిక అధికారులు మాట్లాడుతూ.. ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు కత్తులు, గొడ్డళ్లతో 52 మందిని నరికి చంపేశారని తెలిపారు. కాంగో దళాల చేతిలో ఓటమి పాలవడంతో రగిలిపోయిన అలైట్ డెమోక్రటిక్ ఫోర్సెస్ (ఏడీఎఫ్) సభ్యులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. బెని, లుబెరో ప్రాంతాల్లో ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు పౌరులపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు.
READ MORE: Mirai : తేజసజ్జా మిరాయ్ వాయిదా పడుతుందా..?
Also Read
- Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
- One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
- శ్రావణంలో నాన్‌వెజ్ మిస్ అవుతున్నారా?.. చికెన్, మటన్‌కు మించిన టేస్ట్.. Soya Chunks Dry ట్రై చేయండి!
- HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
ఇస్లామిక్ స్టేట్‌తో ముడిపడి ఉన్న తిరుగుబాటు సంస్థ ఏడీఎఫ్ నిద్రపోతున్న ప్రజలను లేపి తాళ్లతో చేతులు కట్టి కత్తులు, గొడ్డళ్లతో అతికిరాతకంగా నరికి చంపారన్నారు. మెలియా గ్రామంలోనే దాదాపు 30 మంది ప్రాణాలు తీశారన్నారు. ఎనిమిది మంది మహిళలు, ఇద్దరు చిన్నారులతో సహా మొత్తం 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వివరించారు. ఇళ్లకు కూడా నిప్పంటించారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల ఓ క్యాథలిక్ చర్చి ప్రాంగణంలో తిరుగుబాటుదారులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఏడీఎఫ్‌పై అమెరికా, ఐరాస భద్రతామండలిలు ఆంక్షలు విధించాయి. ఈ సంస్థ ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది. పౌరులే లక్ష్యంగా కొన్నేళ్లుగా దాడులకు పాల్పడుతోంది. 2013 నుంచి ఇప్పటివరకు దాదాపు 6వేల మందికి పైగా బలిగొన్నట్లు నివేదికలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
-
Explainer: అమెరికా కుట్ర? ఏకమౌతున్న ముస్లిం దేశాలు..!
-
Annapurna Studios: ఏఎన్నార్ దార్శనికత.. నాగార్జున ఆధునికత.. అన్నపూర్ణ స్టూడియోస్‌కు 51 ఏళ్లు
-
South Stars Mumbai Homes : సౌత్ స్టార్స్‌కు సెకండ్ హోమ్‌గా ముంబై.. కోట్లాది రూపాయల విలువైన హౌసెస్ కొనుగోలు
-
One Cigarette a Day: సిగరెట్లు తగ్గిస్తే సరిపోతుందా..? ధూమపానం తక్కువైనా ప్రమాదం ఎక్కువే..! స్ట్రోక్ ప్రమాదంపై కీలక హెచ్చరిక
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్‌గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!