Anantapur: సీఎం పర్యటన ఏర్పాట్లలో అపశృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anantapur: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ప్రమాదం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా.. హోర్డింగ్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కార్మికుడికి స్వల్పగాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. సీఎం సభాప్రాంగణం దగ్గర ఈ సంఘటన జరిగింది. హోర్డింగ్ కూలడంతో… ఓ కారు ధ్వంసమైంది.
కాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ రేపటి నుంని మూడు రోజుల పాటు సొంత జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం అనంతపురం జిల్లాలో రైతు దినోత్సవంలో పాల్గొన్న తర్వాత.. కడప జిల్లా ఇడుపులపాయ చేరుకుంటున్నారు ఏపీ ముఖ్యమంత్రి. రేపు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వెళ్తారు. అక్కడ ఏపీ మోడల్ స్కూల్ దగ్గర ఏర్పాటు చేసిన సభలో పాల్గొని డాక్టర్ వైఎస్ఆర్ ఇంటిగ్రేటెడ్ అగ్రి ల్యాబ్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారాన్ని ఖాతాల్లో జమ చేస్తారు. ఈ తర్వాత కడప జిల్లా వెళ్తారు సీఎం జగన్.
Also Read
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
- Poori vs Paratha: పూరీ Vs పరాఠా.. దేనితో ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం..? తప్పక తెలుసుకోవాల్సిన నిజాలు
కళ్యాణదుర్గం నుంచి రేపు మధ్యాహ్నం 2 గంటలకు కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌కు చేరుకుంటారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతి సందర్భంగా YSR ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తారు. రేపు రాత్రికి ఇడుపులపాయలోనే ఉంటారు. ఎల్లుండి ఉదయం 9గంటల 20 నిమిషాలకు గండికోట చేరుకుని ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్‌ను సీఎమ్ జగన్ పరిశీలిస్తారు. ఈ తర్వాత పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కీలకమైన వైఎస్ఆర్ స్పోర్ట్స్ అకాడమీకి కూడా ప్రారంభిస్తారు. చి ఇడుపులపాయ చేరుకుంటారు. ఈనెల 10వ తేదీ ఉదయం 9గంటలకు ఇడుపులపాయ నుంచి కడప వెళ్లి… అక్కడా అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. కడప నుంచి కొప్పర్తి వెళ్లి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్థాపన చేస్తారు. 10వ తేదీ మధ్యాహ్నం ఒకటిన్నరకు తిరిగి తాడేపల్లి చేరుకుంటారు సీఎం జగన్.
తాజావార్తలు
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్‌కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్‌తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
-
Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!