రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్‌సలామ్ మూవీ.ఈ ఏడాది ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ మూవీలో రజనీకాంత్ హీరో అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఆయన ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ లో నటించారు.ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నది. లాల్ సలామ్ మూవీతో దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత రజనీకాంత్ తనయ ఐశ్వర్య రజనీకాంత్ మెగాఫోన్ పట్టింది. ధనుష్ హీరోగా నటించిన త్రీ మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వర్య రజనీకాంత్. ఆ తర్వాత వాయ్ రాజా వాయ్ అనే సినిమా చేసింది. లాల్‌సలామ్ మూవీలో టాలీవుడ్ సీనియర్ నటి జీవిత ఓ కీలక పాత్ర చేసింది.దాదాపు నలభై కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన లాల్ సలామ్ మూవీ తమిళం మరియు తెలుగు భాషల్లో కలిపి పది కోట్లలోపే వసూళ్లను రాబట్టింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. రజనీకాంత్ తెలుగు డబ్బింగ్ మూవీస్‌లో అతి తక్కువ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా చెత్త రికార్డును మూటగట్టుకున్నది.థియేటర్స్ లో అంతగా ఆకట్టుకోని ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు.థియేటర్లలో రిలీజై నలభై రోజులు దాటిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. రిలీజ్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమా పరాజయంపై ఐశ్వర్య రజనీకాంత్ ఆసక్తికర కామెంట్స్ చేసారు.
లాల్‌సలామ్ సినిమాకు సంబంధించి 21 రోజులు షూటింగ్ జరిపిన హార్డ్ డిస్క్ మిస్సయిందని ఐశ్వర్య రజనీకాంత్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రతిరోజు 2500 మంది జూనియర్ ఆర్టిస్టులతో…రజనీకాంత్, విష్ణువిశాల్, విక్రాంత్‌లపై 21 రోజుల పాటు కష్టపడి ఓ క్రికెట్ మ్యాచ్ సీన్ ను షూట్ చేశాం. 10 కెమెరాలతో ఎన్నో కష్టాల కోర్చి చేసిన ఆ సీన్స్ బాగా వచ్చాయి కానీ.షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్సయింది. రజనీకాంత్ తో పాటు మిగిలిన హీరోల లుక్ మారడంతో ఆ క్రికెట్ మ్యాచ్ సీన్స్‌ను రీషూట్ చేయడం కుదరలేదు. దాంతో సినిమాను రీ ఎడిట్ చేసి రిలీజ్ చేశాం. ఆ హార్ట్ డిస్క్‌లు ఎలా మిస్సయ్యాయో, ఏమయ్యాయో తెలియడలేదు అని ఐశ్వర్య రజనీకాంత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.ఆ సీన్స్ సినిమాలో ఉంటే రిజల్ట్ వేరుగా ఉండేదని ఆమె చెప్పింది.ఈ హార్డ్‌డిస్క్ మిస్సింగ్ ఎఫెక్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై పడినట్లు సమాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. నెట్‌ఫ్లిక్స్‌కు సమాచారం ఇవ్వకుండానే కథతో పాటు సినిమా లెంగ్త్ లో కూడా మార్పులు చేయడం, క్రికెట్ సీన్స్ రీషూట్ చేయకుండానే థియేటర్లలో రిలీజ్ చేయడంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిసపాయింట్ అయినట్లు సమాచారం. అందుకే లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్‌ను హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం.. ఇప్పట్లో లాల్‌సలామ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం అనుమానమేనని కొంతమంది అంటున్నారు.