Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
- 7.4 తీవ్రతతో భారీ ప్రకంపనలు.. కూలిన భవనాలు
- శిథిలాల కింద చిక్కుకున్న పలువురు.. వీధుల్లోకి జనం
- చారిత్రాత్మక చర్చి టవర్ ధ్వంసం.. 6 ఎయిర్‌పోర్టులు మూసివేత
- రంగంలోకి కొలంబియా ప్రభుత్వం.. సహాయక చర్యలు ముమ్మరం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ కొలంబియాలో సోమవారం సంభవించిన భారీ భూకంపం తీరని విషాదాన్ని నింపింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం ధాటికి కనీసం 47 మంది ప్రాణాలు కోల్పోయారని అసోసియేటెడ్ ప్రెస్ (AP) నివేదించింది. భూకంప ప్రకంపనల తీవ్రతకు పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద అనేకమంది చిక్కుకుపోగా, వేలాది మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు.
శాన్ జోస్ డెల్ పాల్మర్ కేంద్రంగా భూకంపం
రాజధాని బొగోటాకు పశ్చిమాన 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చోకో ప్రాంతంలోని శాన్ జోస్ డెల్ పాల్మర్ (సుమారు 4,800 మంది జనాభా ఉన్న ప్రాంతం) వద్ద భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు గుర్తించారు. భూకంపం భూమికి 107 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. ఈ ప్రకంపనల తీవ్రత పొరుగున ఉన్న ఈక్వెడార్ దేశంలో కూడా స్పష్టంగా కనిపించింది. కొలంబియాలోని పెరీరా నగరంలోనే అత్యధికంగా 18 మంది మరణించారని మేయర్ మౌరిసియో సలాజర్ తెలిపారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
Also Read
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
- Mohsen Rezaee: ఇరాన్ టాప్ సెక్యూరిటీ బాడీకి మాజీ IRGC చీఫ్.. మొహ్సెన్ రెజాయీ నియామకం ఎందుకంత కీలకం?
- Iran and US Tensions: ఇరాన్‌పై మారిన ట్రంప్ వ్యూహం..? ఇక సైనిక దాడులు ఉండవు..! కానీ..
- Israel: నేనున్నంత కాలం పాలస్తీనా దేశం ఉండదు: అమెరికాకు నెతన్యాహూ షాక్..
కూలిన చర్చి టవర్, 6 విమానాశ్రయాల్లో నిలిచిన సేవలు
భూకంప తీవ్రతకు పెరీరా, కాళీ, క్విబ్డో నగరాల్లో అనేక ఇళ్లు, చిన్న భవనాలు కూలిపోయిన దృశ్యాలు స్థానిక మీడియాలో బయటకు వచ్చాయి. మానిజాలెస్ నగరంలో ఉన్న ఒక చారిత్రాత్మక నియో-గోథిక్ కేథడ్రల్ టవర్ తీవ్రంగా దెబ్బతిని కూలిపోయింది. మరోవైపు, భూకంపం కారణంగా పశ్చిమ కొలంబియాలోని పెరీరా, మానిజాలెస్, క్విబ్డో, అర్మేనియా, కార్టాగో, బ్యూనవెంచురా నగరాలకు సేవలుందించే 6 విమానాశ్రయాలు దెబ్బతిన్నాయని, వాటి కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు పౌర విమానయాన సంస్థ ఎక్స్ (X) వేదికగా వెల్లడించింది.
రంగంలోకి ప్రభుత్వం
ఈ పీడకల నుంచి తేరుకునేందుకు కొలంబియా ప్రభుత్వం తక్షణ సహాయక చర్యలను చేపట్టింది. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన దేశ అధ్యక్షుడు అబెలార్డో దే లా ఎస్ప్రియెల్లా స్వయంగా శాన్ జోస్ డెల్ పాల్మర్లో అత్యవసర సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు ధైర్యం చెప్తూ.. “మీరు ఒంటరిగా లేరు, ప్రభుత్వం మీకు అండగా ఉంది, తక్షణ చర్యలు తీసుకుంటోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. కొలంబియాలో చిన్నపాటి భూకంపాలు సాధారణమే అయినప్పటికీ, 6.0 కంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు చాలా అరుదని నిపుణులు చెప్తున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!