Chandrababu Health Condition: రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై రకరకాల ప్రచారాలు సాగుతోన్న నేపథ్యంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. దేశంలోని జైళ్లలో ఎక్కడా ఏసీలు లేవు.. నిబంధనలు ప్రకారం తాము పని చేస్తున్నాం అని స్పష్టం చేశారు.. అయితే, డీహైడ్రేషన్ గా ఉందని చంద్రబాబు చెప్పారు.. ఓఆర్ఎస్ వాడుతున్నారని వెల్లడించారు.. ఇక, స్కిన్ కంప్లయింట్ ఉందని చెప్పారు.. ముందు జైల్లో ఉన్న డాక్టర్లు చంద్రబాబును పరిశీలించారు.. తర్వాత ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు రాజమండ్రి జీజీహెచ్ సూపరిడెంట్ కి సమాచారం ఇచ్చామని.. ఆ తర్వాత.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి డెర్మటాలజిస్ట్ వచ్చి చంద్రబాబును పరిశీలించారని పేర్కొన్నారు.. వైద్యులు చంద్రబాబుకు కొన్ని మందులు రిఫర్ చేశారు, అవి వాడుతున్నారు.. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హెల్త్ కండిషన్ నార్మల్ గా ఉందని తెలిపారు కోస్తాంధ్ర జైళ్ల శాఖ డీఐజీ రవి కిరణ్.
Read Also: Stock Market: జెరోధాను ఓడించిన గ్రో.. క్రియాశీల పెట్టుబడిదారులలో నంబర్ వన్ బ్రోకరేజ్ కంపెనీ