NTV Telugu Site icon

CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్..

Cmr College

Cmr College

మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలు ఆరోపించారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: Kadiyam Srihari: కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం.. కడియం ఆసక్తికర వ్యాఖ్యలు

తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. మరోవైపు.. ఏబీవీపీ మహిళా నేతలు.. విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని.. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టాం. బాత్‌రూమ్‌ల కిటికీల వద్ద ఫింగర్‌ప్రింట్లు సేకరించి, సాంకేతిక ఆధారాలను అన్వేషిస్తున్నాం. హాస్టల్ సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. వారి మొబైల్ ఫోన్లు పరిశీలించి, ఎటువంటి రికార్డింగ్‌లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Read Also: Game Changer: ప్యూర్ గూస్ బంప్స్.. గేమ్ చేంజర్ ట్రైలర్ అదిరింది బాసూ!

Show comments