Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Cmr Engineering College Hostel Warden Suspended

CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్..

Published Date :January 2, 2025 , 6:30 pm
By Rajesh Veeramalla
  • సీఎంఆర్ ఇన్స్టిట్యూట్‌లో జరిగిన ఘటనపై వార్డెన్ ప్రీతి రెడ్డి సస్పెండ్
  • పోలీసులు అదుపులో ప్రీతి రెడ్డి
  • రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేస్తున్నారని విద్యార్థినిల ఆందోళన.
CMR College: సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వార్డెన్ సస్పెండ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

మేడ్చల్ సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ ఘటనలో వార్డెన్ ప్రీతి రెడ్డిని యాజమాన్యం సస్పెండ్ చేసింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. రహస్యంగా కెమెరాలు పెట్టి రికార్డు చేసి వేధింపులకు గురి చేస్తున్నారని సీఎంఆర్ కాలేజ్ విద్యార్థులు ఉదయం ఆందోళన చేపట్టారు. దీంతో.. కాలేజ్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గర్ల్స్ హాస్టల్ ఎదుట విద్యార్థినిలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. హాస్టల్ బాత్రూమ్‌ల్లో సీసీ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినిలు ఆరోపించారు. తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు.

Read Also: Kadiyam Srihari: కేటీఆర్ రేపో, మాపో జైలుకు పోవడం ఖాయం.. కడియం ఆసక్తికర వ్యాఖ్యలు

తమ ప్రైవసీపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థినులు నినాదాలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా పెద్ద దుమారాన్ని రేపింది. మరోవైపు.. ఏబీవీపీ మహిళా నేతలు.. విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని.. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని తెలిపారు. ఈ ఘటనపై ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, “ఫిర్యాదు ఆధారంగా ప్రాథమిక విచారణ చేపట్టాం. బాత్‌రూమ్‌ల కిటికీల వద్ద ఫింగర్‌ప్రింట్లు సేకరించి, సాంకేతిక ఆధారాలను అన్వేషిస్తున్నాం. హాస్టల్ సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేశారు. వారి మొబైల్ ఫోన్లు పరిశీలించి, ఎటువంటి రికార్డింగ్‌లు ఉన్నాయో తెలుసుకుంటాం. ఆరోపణలు నిజమైతే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

Read Also: Game Changer: ప్యూర్ గూస్ బంప్స్.. గేమ్ చేంజర్ ట్రైలర్ అదిరింది బాసూ!

మరోవైపు.. ఈ విషయం తెలుసుకుని రాష్ట్ర ఉమెన్ కమిషన్ మెంబర్ పద్మజా రమణ సీఎంఆర్ గర్ల్స్ కాలేజ్‌కు చేరుకున్నారు. విద్యార్థినిలతో కలిసి మాట్లాడారు. సీఎంఆర్ గర్ల్స్ కాలేజీలో జరిగిన ఘటనపై స్టూడెంట్స్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశాము.. చాలా మంది విద్యార్థినిలతో మాట్లాడామని తెలిపారు. స్టూడెంట్స్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు.. పూర్తి వివరాలు ఉమెన్ కమిషన్ చైర్మన్‌కి అందజేస్తామని చెప్పారు. ఉమెన్ కమిషన్ చైర్మన్ ఈ ఘటనపై సుమోటాగా కేసు తీసుకున్నారన్నారు. అలాగే.. సీఎంఆర్ కాలేజ్ మేనేజ్మెంట్‌కి నోటీసులు ఇచ్చామని చెప్పారు. విచారణలో నిజాలు తెలిన తర్వాత సీఎంఆర్ గర్ల్స్ కాలేజీ యాజమాన్యంపై సీరియస్ యాక్షన్ ఉంటుందని అన్నారు. ఆధారాలు సేకరిస్తున్నాం.. ఇక్కడ జరిగిన వాస్తవాలు రిపోర్ట్ రూపంలో రాష్ట్ర ఉమెన్ కమిషన్ చైర్మన్‌కు అందజేస్తామని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bathroom privacy
  • CMR College Girls Hostel
  • CMR Engineering College
  • hostel warden
  • hyderabad

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions