CMR Engneering College : గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆందోళన
- మేడ్చల్‌లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర ఉద్రిక్తత
- సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థినుల ఆందోళన
- గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లో వీడియోలు తీశారని విద్యార్థినుల ఆగ్రహం
- వంట చేసే వారే వీడియోలు తీసి ఉంటారని అనుమానం
- ఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CMR Engneering College : మేడ్చల్ సమీపంలోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో (CMR Engineering College) గర్ల్స్ హాస్టల్లో జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హాస్టల్ బాత్రూముల్లో కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినిలు గుర్తించి, రహస్యంగా వీడియోలు తీస్తున్నారన్న ఆరోపణలతో ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై విద్యార్థినిలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
వీడియోలు తీసిన వారు హాస్టల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది కావచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో బాధ్యులను తక్షణమే పట్టుకుని కఠినంగా శిక్షించాలని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు. తమ గోప్యతకు భంగం కలిగించిన ఈ దారుణ ఘటనపై కళాశాల యాజమాన్యం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు.
Also Read
- Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
- PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
- Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
- Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే కాలేజీకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థినులతో మాట్లాడి, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థినుల ఆందోళనను తగ్గించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.
అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేసి, కొందరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హాస్టల్లో విద్యార్థినుల భద్రతకు సంబంధించి ఈ ఘటన అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. కళాశాల యాజమాన్యం భద్రతా వ్యవస్థను సమీక్షించి, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థినిలు కోరుతున్నారు.
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. వీటికి ఆమోదం తెలపనున్న ప్రభుత్వం..
తాజావార్తలు
-
Central Employees: కేంద్ర ఉద్యోగుల జీతాల్లో ఊహించని మార్పు.. 3 శాతం ఉన్న ఇంక్రిమెంట్ 6 శాతానికి..?
-
Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
-
PM Modi: ఉజ్బెకిస్థాన్‌కు చేరుకున్న మోడీ.. అధ్యక్షుడు మిర్జియోయెవ్ ఘన స్వాగతం
-
Geoffrey Boycott: సచిన్, లారాలను మించిపోయే సత్తా అతడికి ఉంది.. సంచలన వ్యాఖ్యలు..
-
Sanju Samson: ప్రపంచకప్ గెలవాలనే ఆ ఒక్క నిర్ణయం శామ్సన్ కెరీర్‌ను మార్చేసిందా..? అసలు ఏం జరిగిందంటే..
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!