CMF Phone 1: నథింగ్ సబ్ బ్రాండ్ CMF తన మొదటి స్మార్ట్‌ఫోన్ ను త్వరలో విడుదల చేయబోతోంది. కంపెనీ తన మొదటి హ్యాండ్‌సెట్ CMF ఫోన్ 1ని ఈ నెల ప్రారంభంలో విడుదల చేయనుంది. ఈ విషయాన్నీ ప్రముఖ ఆన్లైన్ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో కనపడడంతో తెలిసింది. అక్కడ ఫోన్ గురించిన కొంత సమాచారం కూడా అందులో ఇవ్వబడింది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుందని కంపెనీ మైక్రోసైట్ నుండి స్పష్టంగా తెలుస్తుంది. ఇది కాకుండా.. ఫోన్ సంబంధిత కొంత సమాచారం లీక్ నివేదికలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ ఫోన్ జూలై 8న భారతదేశంలో లాంచ్ కానుంది.
ఇక తెలిసిన సమాచారం మేరకు CMF ఫోన్ 1లో 6.7-అంగుళాల sAMOLED LTPS డిస్‌ప్లేను పొందవచ్చు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతుతో వస్తుంది. ఈ ఫోన్ యొక్క గరిష్ట ప్రకాశం 2000 నిట్ లుగా ఉంటుంది. ఇందులో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే , ఫోన్‌లో 16MP సెల్ఫీ కెమెరాను పొందు పరిచారు. ఇది మధ్య పంచ్ హోల్ కటౌట్‌లో సరిపోతుంది. ఇది కాకుండా, 50MP ప్రధాన లెన్స్‌తో కూడిన కెమెరాను స్మార్ట్‌ఫోన్‌లో కనుగొనవచ్చు. ఫోన్‌లో డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ లో AI వివిడ్ మోడ్ ను ఇవ్వవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ ను మీడియా టెక్ డిమెంసిటీ 7300 ప్రాసెసర్‌తో ప్రారంభించవచ్చు. దీనికి 6GB, 8GB RAMతో 128GB స్టోరేజ్ ఇవ్వవచ్చు. మైక్రో SD కార్డ్ సహాయంతో స్టోరేజీని విస్తరించుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. ఆండ్రాయిడ్ 14తో ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు.
HBD M. M. Keeravani : మా ‘ఆస్కారుడు’ కు పుట్టినరోజు శుభాకాంక్షలంటున్న మెగాస్టార్..
ఫోన్‌ను బ్యాటరీ విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ అందించబడుతుంది. ఇది కాకుండా, ఈ హ్యాండ్‌సెట్ IP52 రేటింగ్‌తో ప్రారంభించబడుతుంది. ఇది నథింగ్ ఫోన్ 2a యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చని కొన్ని నివేదికలలో నివేదించారు. కంపెనీ CMF ఫోన్ 1ని రెండు కాన్ఫిగరేషన్ లలో ప్రారంభించవచ్చు. దీని 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999 కాగా, 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.17,999కి లాంచ్ చేయవచ్చు. అయితే ఫోన్ బాక్స్‌పై దీని ధర రూ.19,999గా ఇవ్వబడింది.