CM YS Jagan: గ్రాఫ్ ఉంటేనే సీటు.. లేదంటే లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: వైసీపీ ఎమ్మెల్యేలకు గడప గడప గండం పొంచి ఉంది. గడపగడపలో గ్రాఫ్ ఉంటేనే సీట్ ఇస్తామని… లేదంటే లేదని తేల్చిచెప్పేశారు సీఎం జగన్. గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చేసిన సర్వే నివేదిక వివరాలను ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంపై సుదీర్ఘంగా ప్రజంటేషన్ ఇచ్చారు. గడప గడప సమీక్షలో ప్రతిసారీ సీఎం జగన్ ఇదే చెప్తున్నా… కొందరు ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవడం లేదు. ఇప్పటికీ 18మంది ఎమ్మెల్యేలు వెనకబడి ఉన్నారని హెచ్చరించారు. సరిగా పని చేయని 18 మంది శాసనసభ్యులను…ఒక్కొక్కరిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ఎన్నికలకు 9 నెలలే ఉన్నందున ఇదే చివరి చివరి అవకాశమన్నారు. అక్టోబర్‌లోగా గడప గడప గ్రాఫ్ మెరుగుపర్చుకోని నేతలకు టికెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. టికెట్లు ఇచ్చే విషయంలో ఎలాంటి మెహమాటలు ఉండవని పార్టీ గెలుపే ముఖ్యమన్నారు సీఎం జగన్.
Read Also: Hyderabad: వాహనదారులకు అలర్ట్.. రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..!
Also Read
ప్రభుత్వం సంక్షేమ పథకాలు… ప్రజలకు చేసిన మంచి పనులు ఇంటింటికీ వెళ్లి చెప్పుకోవడమే గడప గడప కాన్సెప్ట్. జగన్ ఎన్నిసార్లు చెప్పినా ఎమ్మెల్యేలు లైట్ తీసుకుంటున్నారు. దీంతో సర్వేల ఆధారంగానే సీట్లు ఇస్తామని.. అందులో మొహమాటాలు ఏమీ లేవని తేల్చేశారు సీఎం జగన్. సీట్ ఇవ్వలేని వారికి నామినేటెడ్ పదవులు మాత్రమే ఇవ్వగలమని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరో 9నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని నేతలతో సీఎం జగన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలవాలని చెప్పారు. ఎన్నికల్లో తప్పని సరిగా గెలిచేందుకు అంతా కష్టపడి పనిచేయాలన్నారు.
తాజావార్తలు
-
Spicy Idli Chaat Recipe: మిగిలిన ఇడ్లీలతో సూపర్ స్పైసీ చాట్.. 5 నిమిషాల్లో రెడీ..!
-
Akash Goparaju: కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో సింగర్ సునీత కొడుకు ‘కొత్త మలుపు’
-
Anil Ravipudi: సంక్రాంతి టార్గెట్‌గా అనిల్ రావిపూడి కొత్త సినిమా.. ముహూర్తం డేట్ అఫీషియల్‌గా ప్రకటించిన డైరెక్టర్!
-
India Job Crisis: ఇంజనీరింగ్ చేసి స్వీపర్ పోస్టులకు అప్లై చేస్తున్నారు.. ఇక డిగ్రీలు దండగేనా?
-
POK killings: పీఓకేలో పాక్ హత్యాకాండ.. 30 మంది బ్రిటిష్ ఎంపీల ఆందోళన..
ట్రెండింగ్
-
India Fertility Rate: యువ భారత్‌కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!