CM YS Jagan: నాడు పాదయాత్రలో మీ కష్టాలు చూశాను.. నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పాను. నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఆస్పత్రి, త్రాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి మీ బిడ్డ మీ ముందు నిలబడ్డాడు అని వ్యాఖ్యానించారు సీఎం వైఎస్ జగన్.. శ్రీకాకుళం జిల్లా పర్యటనలో.. కిడ్నీ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపుతూ.. తాగునీటి ప్రాజెక్టును, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఆస్పత్రిని ప్రారంభించిన ఆయన.. అనంతరం.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.. 700 కోట్లతో హీరమండలం రిజర్వాయర్ నుంచి పైప్ లైన్ ద్వారా ఇచ్చాపురం వరకూ సుద్దమైన త్రాగునీటి ని అందిస్తున్నాం. అత్యున్నత ప్రమాణాలతో కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి పనిచేయబోతుంది. నెప్రాలజీ, యూరాలజి బెడ్స్ ఐసీయూతో ఏర్పాటు చేశాం.. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ కూడా చేసి చూపించాలని భావిస్తున్నాం అన్నారు.. అంతర్జాతీయ సంస్థలతో కలసి పనిచేస్తున్నాం.. అన్ని సదుపాయాలు కిడ్నీ రీసర్చ్ సూపర్ స్పెషాలిటీ సర్వీసులు అందిస్తున్నాం అని వెల్లడించారు..
Read Also: Hombale: సలార్ మేనియాలో భగీర ప్రమోషన్స్…
375 మంది డాక్టర్లు , సిబ్బంది అందుబాటులో ఉన్నారు అని తెలిపారు సీఎం జగన్.. శ్రీకాకుళం జిల్లాలో 69 డయాలసిస్ యంత్రాలను పెట్టామని వెల్లడించిన ఆయన.. ప్రతి అడుగూ మానవతా దృక్పదంతో ముందుకు సాగుతున్నాం.. కిడ్నీ వ్యాధు గ్రస్తుల భాదలు చూశా.. అధికారంలో వచ్చిన వెంటనే 2500 పించన్ ను నేడు పదివేలు ఇస్తున్నది మీ బిడ్డ ప్రభుత్వమే. అన్నారు.. 13,143 పెన్షన్లు పెంచడం మొదలు పెట్టాం. కేవలం పించన్ల సొమ్మే ప్రతి నెలా పన్నిండు కోట్లు దాటింది.. కిడ్నీ సమస్య తెలుసుకొనేందుకు , కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు .అంతర్జాతీయ సంస్థలతో కూడా కలిసి పనిచేస్తున్నాం అన్నారు.. రాష్ర్టంలో కిడ్నీ రోగులు ఎక్కడ ఉన్నా పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. ఊహాకు కుడా అందని విధంగా 700 కోట్లతో హిరమండలం నుంచి నీరు తెస్తున్నాం. 807 గ్రామాలకు లక్షా తొంబై ఎనిమిది వేల కుటుంబాలకు త్రాగునీరు అందిస్తున్నాం. పాతపట్నం నియోజకవర్గం లో మరో రెండుందల కోట్లతో త్రాగునీరు అందించబోతున్నాం అని ప్రకటించారు సీఎం వైఎస్ జగన్.