పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా సలార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని సలార్ సినిమా మీట్ అయితే చాలు ప్రభాస్-ప్రశాంత్ నీల్ డిసెంబర్ 22న సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సలార్ మేనియా మరింత పెరిగింది. రోజు రోజుకీ పెరుగుతున్న సలార్ హైప్ ని వాడుకుంటూ సూపర్ ప్లాన్ వేసింది హోంబలే ఫిల్మ్స్. ఈ ప్రొడక్షన్ నుంచి రానున్న సినిమాల్లో ‘భగీర’ ఒకటి. సలార్ బజ్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ టైమ్ లో భగీర సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తే మంచి పాన్ ఇండియా రీచ్ వస్తుంది.
ఉగ్రమ్ ఫేమ్ శ్రీ మురళి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ కథని అందించాడు. సూరి భగీర సినిమాని తెరకెక్కిస్తుండగా గణేశన్ శేఖర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గతంలో రిలీజ్ చేసిన భగీర మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా డిసెంబర్ 17న శ్రీ మురళి బర్త్ డే కావడంతో భగీర టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్లు హోంబలే అనౌన్స్ చేసింది. డిసెంబర్ 17న ఉదయం 9:45 నిమిషాలకి భగీర టీజర్ బయటకి రానుంది. శ్రీ మురళి ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ గ్యాంగ్ స్టర్ కథలనే రాసిన ప్రశాంత్ నీల్, మొదటిసారి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ తో కథని ఎలా రాశాడో చూడాలి.
The countdown to justice begins.
3 days to go for #BagheeraTeaser 💥
Releasing on December 17th at 9:45 AM! #Bagheera @SRIMURALIII #DrSuri #PrashanthNeel @VKiragandur @rukminitweets @AJANEESHB @hombalefilms @GarudaRam @AJShetty @ChethanDsouza @yogigraj @prakashraaj… pic.twitter.com/x7s8tV8FYO— Hombale Films (@hombalefilms) December 14, 2023