CM YS Jagan: విశాఖపట్నానికి ఇనార్బిట్ మాల్ ఆణిముత్యంగా మిగిలిపోతుందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. విశాఖ పర్యటనలో ఉన్న ఆయన.. కైలాసపురం వద్ద ఇనార్బిట్ మాల్‌కు శంకుస్థాపన చేశారు.. రూ. 600 కోట్లతో 17 ఎకరాల స్థలంలో ఇనార్బిట్ మాల్‌ను నిర్మించేందుకు సిద్ధమైంది కె.రహేజా గ్రూపు.. మొత్తం 17 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మూడు దశల్లో ఇనార్బిట్ మాల్ విస్తరణ చేయనున్నారు.. ఈ రోజు తొలి దశ పనులకు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించనున్నారు. రూ.600 కోట్ల వ్యయంతో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఇనార్బిట్ మాల్ విశాఖకు ఆణిముత్యంగా మిగిలి పోతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
Read Also: Bhatti Vikramarka: ప్రభుత్వ ఆస్తులు అమ్మితే చూస్తూ ఊరుకోము..!
ఇక, 13 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద మాల్ వస్తోంది.. 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఫేజ్ 2లో రెండున్నర ఎకరాల్లో ఐటీ టవర్, కన్వెన్షన్ సెంటర్ రాబోతున్నాయి.. మూడు వేల మందికి ఐటీలో ఉద్యోగాలు లభిస్తాయన్న ఆయన.. ఆదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్ పోర్ట్, మూలపేటలో సీ పోర్ట్ ఇవన్నీ ఉత్తరాంధ్రలో రూపు రేఖలు మారుస్తాయన్నారు. ఒబారాయ్, మైఫేర్, రహేజా గ్రూప్‌లు ఆతిథ్య రంగంలో లగ్జరీ రిసార్ట్స్ ప్రారంభించనున్నాయని వెల్లడించారు. హిందూపురంలో 15 వేల ఉద్యోగాల కల్పన కోసం చేపట్టిన ప్రాజెక్టుకు సహకరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులతో వస్తున్న రహేజాకు ఫోన్ కాల్ దూరంలో ప్రభుత్వం ఉంటుందని.. అన్ని విధాలుగా సహకారం అందిస్తామి స్పష్టం చేశారు సీఎం వైఎస్ జగన్. మరోవైపు.. జీవీఎంసీ పరిధిలో 136 కోట్ల రూపాయలతో 50 అభివృద్ధి పనులను ప్రారంభించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.