NTV Telugu Site icon

Yogi Adityanath: మోదీ నాయకత్వంలో దేశంలో అద్భుతమైన క్రీడా వాతావరణం ఏర్పడింది..

Yogi

Yogi

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో గత కొన్నేళ్లుగా దేశంలో క్రీడా కార్యకలాపాలకు అద్భుతమైన వాతావరణం ఏర్పడిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఈ క్రమంలో.. అంతర్జాతీయంగా క్రీడా రంగంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన తెలిపారు. ఒలింపిక్స్‌, ఆసియా క్రీడలు, కామన్‌వెల్త్‌ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారుల పతకాల సంఖ్యను బట్టి చెప్పవచ్చు.. ఇండియాలో క్రీడలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయో…..

Criminal Cases: 2022లో ఢిల్లీలో దాదాపు 3 లక్షల క్రిమినల్ కేసులు నమోదు.. NCRB నివేదిక

ఉత్తరప్రదేశ్‌ రూరల్‌ స్పోర్ట్స్‌ లీగ్‌ ప్రారంభం, మహంత్‌ అవేద్యనాథ్‌ మెమోరియల్‌ ఆల్‌ ఇండియా ప్రైజ్‌ మనీ కబడ్డీ పోటీల ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా ప్రచారం, ఎంపీ క్రీడా పోటీలు క్రీడలకు ఎంతో ప్రోత్సాహాన్నిచ్చాయన్నారు. రాష్ట్రంలో క్రీడా వనరులు, కార్యకలాపాలను పెంచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని యోగి పేర్కొన్నారు. దీని ద్వారా.. ప్రతి గ్రామంలో క్రీడా మైదానాలు, ఓపెన్‌ జిమ్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో స్టేడియంలు, బ్లాక్ స్థాయిలో మినీ స్టేడియంలు నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో రెండు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలు ఉండగా, వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయని తెలిపారు.

Antony: ఆదికేశవ విలన్ ఖాతాలో మరో హిట్..

అంతేకాకుండా.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నగదు రివార్డులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తుందని యోగి ఆదిత్యానాథ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను గెజిటెడ్ పోస్టుల్లో నియమిస్తున్నామని.. రాష్ట్రంలో 500 మంది క్రీడాకారులను నియమించామని ఆయన తెలిపారు.