రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రాత్రికి లాక్ డౌన్ మీద మహారాష్ట్ర సీఎం అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. 15 రోజుల పాటు మహారాష్ట్రలో లాక్ డౌన్ తప్పనిసరి అని ఉద్ధవ్ సర్కార్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే అఖిలపక్షం నిర్వహించి ప్రభుత్వ నిర్ణయాన్ని చూచాయగా ఉద్ధవ్ క్లారిటీ ఇచ్చారు. దేశంలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రం మహారాష్ట్ర. మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చితే మహారాష్ట్రలో రెట్టింపు సంఖ్యలో పాజిటివ్ కేసులు వచ్చాయి. ఇప్పుడు సెకండ్ వేవ్ లో మహారాష్ట్ర కొత్త కేసుల తాకిడితో విలవిల్లాడుతోంది. నిన్న ఒక్కరోజే 51,751 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి ఈ నెల 30 వరకు మహారాష్ట్రలో లాక్ డౌన్ విధించేందుకు సన్నద్ధమవుతున్నట్టు సమాచారం.