NTV Telugu Site icon

Revanth Reddy: అదానీ, ప్రధానిపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం రేవంత్

Revanth

Revanth

Revanth Reddy: తెలంగాణలో ఆదానీ వ్యాపారాలు, మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ మంగళవారం (డిసెంబర్ 18, 2024) పెద్ద స్థాయిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమం “చలో రాజ్ భవన్” పేరుతో జరిగింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గల అదానీ అవకతవకలపై నిరసనలు తెలంగాణలో చేపట్టారు. హైదరాబాద్‌లో, నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం నుంచి రాజ్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇంకా పార్టీలోని కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అయితే, పోలీసుల నిరాకరణ కారణంగా ర్యాలీ రాజ్ భవన్ వద్ద అడ్డుకునే పరిస్థితి వచ్చింది. తెలంగాణ పోలీసులు నిరసనకారులను రాజ్ భవన్ దగ్గరికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారని, గవర్నర్ ఆఫీస్ చేరుకోలేకపోయామని కాంగ్రెస్ నాయకులు చెప్పారు.

Also Read: Spy Camera: యూపీలో టీచర్ల బాత్రూంలో స్పై కెమెరా.. స్కూల్ డైరెక్టర్‌ అరెస్ట్!

రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఆదానీ వ్యాపారాలకు, అవినీతికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ నిరసన చేపట్టారు. ముఖ్యంగా, ఆదానీ-మోడీ సంబంధం దేశపరంగా ప్రతిష్టను దెబ్బతీస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ దేశంలో వ్యాపారాలు చేయాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితిని మోడీ-అదానీ సృష్టించారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అదానీ అవకతవకలపై జాతీయ పర్యవేక్షణ కమిటీ (జేపీసీ) ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసారు. అదానీ విషయంలో ప్రధాని మోడీ కనీసం మాట్లాడటానికి కూడా సిద్ధపడడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నేతలు, ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ వ్యవహారాన్ని రాజ్యసభలో లేవనెత్తాలని కోరారు.

ఈ ధర్నాలో బిఆర్‌ఎస్ పార్టీపై కూడా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు సన్నాసులు… వాళ్ళు చెయ్యరు… మేము చేస్తే… తప్పు పడుతారని కాస్త ఘాటుగానే ఆరోపించారు. మేము నిరసన చేస్తుంటే మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. వాళ్ళు అదానీకి, మోడీ కి లొంగిపోయారు.. అందుకే ఇలాంటి నిరసనలను తప్పు పడుతున్నారని, బిఆర్‌ఎస్ కు కనీస నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, ఈ కార్యక్రమాన్ని దేశ భవిష్యత్తుకు, ప్రజల సంక్షేమానికి గల బాధ్యతగా చూడాలని ఆయన అన్నారు.

Show comments