Site icon NTV Telugu

CM Revanth Reddy: మహబూబ్ నగర్ పై సీఎం రేవంత్ వరాల జల్లు.. రూ.1,284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Cm Revanth

Cm Revanth

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో రూ.1284 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఎం.వి.ఎస్ డిగ్రీ,పి.జి కళాశాలలో రూ.200 కోట్లతో మహబూబ్ నగర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు శంకుస్థాపన చేశారు. రూ.20.50 కోట్లతో ఎం. వి.ఎస్.డిగ్రీ కళాశాల అదనపు తరగతి గదులకు శంకు స్థాపన చేశారు.

Also Read:BMC Results: ముంబైలో “రిసార్ట్” పాలిటిక్స్.. స్టార్ హోటల్‌లో షిండే సేన కార్పొరేటర్లు..

UIDF నిధులతో మహబూబ్ నగర్ నగర పాలక సంస్థ లో రూ.220.94 కోట్లతో త్రాగు నీటి మెరుగు పరచు పనులకు శంకు స్థాపన, UIDF నిధులతో మహబూబ్ నగర్ నగర పాలక సంస్థలో రూ.603 కోట్లతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకు స్థాపన, రూ.40 కోట్లతో నిర్మించనున్న నర్సింగ్ కళాశాల భవనానికి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Also Read:TDP vs Jana Sena Clash: టీడీపీ వర్సెస్‌ జనసేన.. కొట్టుకున్న నేతలు..!

భారాసా ప్రభుత్వం పదేళ్లపాటు పాలమూరు జిల్లా ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది. కేసీఆర్‌ పదేళ్లపాటు పాలమూరు జిల్లాకు ఒక్క ప్రాజెక్ట కూడా తీసుకురాలేదు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును 2013లో అప్పటి కాంగ్రెస్‌ నేతలు సాధించారు. ప్రాజెక్టు పేరు మీద రూ.23 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారు కానీ, ప్రాజెక్టు పూర్తి చేయలేదు. ఉద్ధండాపూర్‌ జలాశయం భూ నిర్వాసితులకు నిధులు చెల్లించలేదు. సంగంబండ వద్ద బండ పగుల గొట్టేందుకు కేసీఆర్‌ పదేళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారన్నారు. భాజపా ఎంపీలు రాష్ట్రానికి ఐఐఎం సాధిస్తే.. పాలమూరు జిల్లాలోనే భూమి ఇచ్చే బాధ్యత నాది అని సవాల్ విసిరారు. పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ తెలిపారు.

Exit mobile version