NTV Telugu Site icon

CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, సినీ పరిశ్రమ, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని ప్రముఖ నిర్మాత, టీఎఫ్ డీసీ ఛైర్మన్ దిల్ రాజు వ్యాఖ్యానించారు. ఈ రేపు సీఎం రేవంత్ రెడ్డితో పలువురు సినీ ప్రముఖులతో కలిసి భేటీ కావాలని దిల్ రాజు ప్రకటించారు. అయితే.. తాజాగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ ప్రముఖుల మధ్య ముఖ్యమైన భేటీపై క్లారిటీ వచ్చింది. ఈ సమావేశం రేపు ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరగనుంది. ఈ భేటీలో టాలీవుడ్‌ నుంచి ప్రముఖ నటులు, నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు.

Bangladesh: యూనస్ ప్రభుత్వంపై షేక్ హసీనా కుమారుడి సంచలన ఆరోపణలు..

సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను సమీక్షించుకునే ఈ సమావేశంలో టాలీవుడ్‌ ప్రముఖులు చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, పలువురు ప్రముఖ నిర్మాతలు, దర్శకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ పక్షం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ తదితరులు పాల్గొననున్నారు. సినీ పరిశ్రమకు సంబంధించిన వివిధ సమస్యలపై చర్చ జరగనుంది. పన్నుల విధానం, ఫిల్మ్ ఛాంబర్ ఫీల్, పరిశ్రమకు ఇన్‌సెంటివ్స్ ఇవ్వడం, సౌకర్యాల అభివృద్ధి, అలాగే ఇతర అనేక అంశాలు ఉంటాయని సమాచారం. ఈ చర్చలు, టాలీవుడ్‌ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయనే ఆశయంతో జరుగుతున్నాయి. ఈ భేటీ సినిమా పరిశ్రమకు కావాల్సిన ప్రాధాన్యతను కేటాయించడమే కాక, సమర్థవంతమైన పరిష్కారాలపై పునరాలోచన చేసే అవకాశం కూడా కల్పించనుందని భావిస్తున్నారు.

UP: స్నేహితురాలి బర్త్‌డే సెలబ్రేషన్‌లో క్లాస్‌మేట్స్ దుశ్చర్య.. దళిత టెన్త్ విద్యార్థి ఆత్మహత్య

Show comments