CM Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లో కథువా బహిరంగ సభలో ఖర్గే అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఖర్గేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు. మల్లికార్జున ఖర్గేను మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించడంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఖర్గేతో పాటు పార్టీ అగ్ర నేతలను సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది.
Read Also: Bhatti Vikramarka: సీఎంఆర్ పెండింగ్.. మిల్లులపై కఠిన చర్యలకు డిప్యూటీ సీఎం ఆదేశాలు
ఏఐసీసీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యే అవకాశం ఉంది. చాలాకాలంగా పెండింగ్ ఉన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏఐసీసీ తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దసరా (అక్టోబర్ 12) కు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.