తెలంగాణలో భారీ వర్షాలతో దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు రూ.11,713.49 కోట్లు సత్వరమే విడుదల చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు. తెలంగాణలో ఆగస్టు 31 నుంచి నుంచి సెప్టెంబరు 8వ తేదీ వరకు కురిసిన భారీ వర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపాయని సీఎం తెలిపారు.
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను పరామర్శించనున్నారు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రంలో వరదల వల్ల జరిగిన నష్టంపై కేంద్రంతో చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో వర్షాలు, వరదల వల్ల సంభవించిన భారీ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇవాళ అమిత్ షాను కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలుపనున్నారు.