NTV Telugu Site icon

CM Revanth Reddy: ఆదిలాబాద్‌కు సీఎం రేవంత్ రెడ్డి వరాలు..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 5 గ్యారెంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే రుణమాఫీ చేసుకోబోతున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డైట్ కళాశాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రాంజీ గోండు, కొమురంభీం పోరాటాలను సీఎం గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్‌ జిల్లా వాసులకు వరాల జల్లు కురిపించారు. బోథ్ ప్రాంతంలో కుప్టీ ప్రాజెక్టు నిర్మిస్తామని.. కడెం ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం నిధులు ఇచ్చామని.. పనులు చేస్తున్నామని తెలిపారు. తుమ్మడిహట్టిలో ప్రాజెక్టు నిర్మిస్తామని.. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. అక్కడి ముంపు ప్రాంతాలపై ఆ ప్రభుత్వంను ఒప్పిస్తామని సీఎం రేవంత్ అన్నారు ఆదిలాబాద్‌లో యూనివర్శిటి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మోడీ, కేడీ కలసి సిమెంట్ కర్మాగారం అలానే ఉంచారని.. ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడి అయినా సరే ఆదిలాబాద్‌లో మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపిస్తామన్నారు.

Read Also: Piyush Goyal: తెలంగాణలో బీజేపీ క్లీన్‌స్వీప్‌ చేస్తుంది.. రాహుల్‌ ఎప్పటికీ ప్రధాని కాలేరు..

కూ.1325 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించిందని ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి అండగా ఉన్నామన్నారు. పాదయాత్రలో మహిళలు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని భట్టి విక్రమార్క దృష్టి తీసుకొచ్చారని.. ఆడబిడ్డలకు 5 వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. ఉచిత కరెంటు ఆపాలని మోడీ, కేసీఆర్ కాంగ్రెస్‌ను పడ గొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని. కానీ కేసీఆర్, ఆయన కుమారుడు కట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్, మోడీ పదేళ్లుగా పాలన చేసిన వారిద్దరు ప్రజలకు ఏం చేయలేదన్నారు. వంద రోజుల్లో ఏం చేయలేదు అని చెప్పే బీజేపీ, బీఆర్‌ఎస్‌లను నడిరోడ్డు మీద ఉరితీయాలా.. ఆలోచించాలన్నారు. బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కట్టలేదని.. గిరిజన యూనవర్సిటీని ఆపారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మోడీ నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారంటూ విమర్శలు గుప్పించారన్నారు. పదేళ్లు బీజేపీకి ఇచ్చారని.. కాంగ్రెస్‌కు పదేళ్లు అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ ప్రజలను విజ్ఞప్తి చేశారు.