Site icon NTV Telugu

CM Revanth Reddy : కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం.. బీఆర్ఎస్ ఇక దెయ్యాల పార్టీ.. డీఆర్ఎస్

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆయన, మొత్తం రూ.1500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం తిర్మలాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ వ్యాఖ్యానిస్తూ.. బీఆర్ఎస్ పాలనలో నాపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారన్నారు. బెయిల్‌పై బయటకి వచ్చాకే కేసీఆర్‌ను కూలదోస్తానని అన్నానని, ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకొని ఆయనను అధికారంలో నుండి దించామన్నారు.

Mohandas Pai: కన్నడ భాషపై కొనసాగుతున్న వివాదం.. ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ సంచలన వ్యాఖ్యలు

ఇప్పుడు కమిషన్ నోటీసులు ఇచ్చామంటేనే కేసీఆర్ ఉలిక్కిపడుతున్నాడని, కానీ నేను నెలల తరబడి జైల్లో ఉన్నానని, అప్పుడు ఆయన నన్ను ఎంత హింసించారో దేశమంతా తెలుసు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన “కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయన్న” వ్యాఖ్యలపై కూడా రేవంత్ స్పందించారు. “పార్టీ నేతలే దెయ్యాలున్నాయని అంటున్నారు. అలాంటి పార్టీలో ఉన్న కేసీఆర్ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఇకపై బీఆర్ఎస్ కాదు, డీఆర్ఎస్ – దెయ్యాల రాజ్య సమితి. ఆ పార్టీకి అంతం రావలసిందే” అని హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో దెయ్యాల మధ్యే జీవిస్తున్నారని, కవిత చెప్పిన దెయ్యాల పంచాయతీకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

G7 Summit: జీ-7 సమ్మిట్ కు ప్రధాని మోడీకి ఆహ్వానం..

Exit mobile version