Prajapalana Program: గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు.. డిసెంబర్ 28 నుంచి షురూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రామ సదస్సులకు ‘ప్రజాపాలన’గా పేరు మార్చారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టాలన్నారు.
Also Read: India Women: మరో సంచలనం సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టు!
Also Read
గత ప్రభుత్వ లోపాలను సరిదిద్దడంతో పాటు తాము ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు, యంత్రాంగాన్ని గ్రామ స్థాయికి తీసుకెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సెక్రటేరియేట్‌లో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశం అయ్యారు. సెక్రటేరియేట్‌లోని ఏడో అంతస్తులోని డోమ్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, సంబంధిత అధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక.. పాలనా వ్యవస్థలో అత్యంత కీలకమైన కలెక్టర్లతో సీఎం సమావేశం కావడం ఇదే మొదటిసారి. పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన కార్యాచరణపై సీఎం ఈ సమావేశంలో చర్చించారు.
తాజావార్తలు
-
Bangladesh: మార్షల్ ఆర్ట్స్ పేరుతో ఉగ్రవాదం..
-
AP CM Chandrababu: ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు..
-
Shabad Murders : షాబాద్ హంతకుడు రాజ్‌కుమార్ వేటలో విస్తుపోయే నిజాలు
-
Johnny Master – Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
-
Khamenei Funeral: ఖమేనీ అంత్యక్రియల్లో “మాస్క్ మ్యాన్”.. ఎవరనేది తెలిసింది
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..