Site icon NTV Telugu

CM Revanth Reddy: పాతబస్తీ మీర్‌ చౌక్‌ అగ్రిప్రమాదంపై సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: హైదరాబాద్‌లోని పాతబస్తీ మీర్ చౌక్ ప్రాంతంలో జరిగిన విషాదకరమైన అగ్నిప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలిసిన వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి, సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, వారికి అన్ని విధాలా సహాయం చేయాలని సూచించారు.

 
UP: పెళ్లైన ఆరు రోజులకే ఘోరం.. అందుకు ఒప్పుకోలేదని..
 

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. “ఈ విషాద సమయంలో ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తుంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఆయన అన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సహాయక చర్యలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయం అందించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు సమీపంలోని ఆసుపత్రులలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

 Fire Accident : పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి.. మృతుల్లో ఓ చిన్నారి..?

Exit mobile version