CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
- సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట
- నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి రేవంత్‌కు మినహాయింపు
- విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Renvanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి ఎక్సైజ్ కోర్టులో జరుగుతున్న ఓ కేసు విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలన్న ఆదేశాల నుంచి హైకోర్టు ఆయనకు మినహాయింపునిచ్చింది. ఈ కేసులో రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా హాజరు కావాలని నాంపల్లి ఎక్సైజ్ కోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. అయితే, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి అధికారిక కార్యక్రమాల వల్ల కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాదని ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, రేవంత్ రెడ్డికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిస్తూ తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో రేవంత్ రెడ్డికి కొంత ఊరట లభించినట్లయింది. అయితే, ఈ కేసులో న్యాయస్థానం తదుపరి విచారణను కొనసాగించనుంది.
ఈ వివాదం 2024 మే 5న కొత్తగూడెంలో జరిగిన ‘జన జాతర’ సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో మొదలైంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా ఫేక్ వీడియోను సృష్టించి, దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆయన ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు విచారించింది. ఈ విచారణను జూన్ 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. దీంతో రేవంత్ రెడ్డికి తాత్కాలికంగా ఊరట లభించింది.
Also Read
- Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
- Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
- 50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
- YS Jagan: తూర్పు గోదావరిలో వైఎస్ జగన్ పర్యటన.. పొగాకు కొనుగోళ్లపై సమీక్ష, రైతులతో ముఖాముఖి!
Virat Kohli: బాబర్, గేల్ల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ!
తాజావార్తలు
-
Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
OG 2 : పవర్ స్టార్ట్ ఫ్యాన్స్ ఓపిక పట్టాల్సిందే.. OG2 ఇప్పట్లో లేనట్టేనా?
-
Sobhita Dhulipala: ఎవరికీ తెలియని సీక్రెట్ ని పంచుకున్న శోభిత.. షాక్ అవుతున్న నెటిజెన్స్
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
ట్రెండింగ్
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!