CM Revanth Reddy: ఎంవోయూల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: వివిధ వేదికలపై ప్రముఖ కంపెనీలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) వేగంగా అమల్లోకి వచ్చేలా చూడాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే భూముల కేటాయింపుతో పాటు ఇతర అనుమతులు ఇచ్చిన కంపెనీలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. దావోస్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో పాటు ఇతర వేదికలపై వివిధ సంస్థలతో కుదుర్చుకున్న ఎంవోయూలపై పురోగతిపై ముఖ్యమంత్రి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు సంబంధించి పనులు ప్రారంభమైన కంపెనీలు… అనుమతుల దశలో ఉన్న కంపెనీలు.. సాంకేతిక, ఇతర సమస్యలతో పనులు పెండింగ్‌లో ఉన్న సంస్థల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఫ్యూచర్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆయా సంస్థకు కేటాయించిన భూములు, అక్కడి మార్కెట్ ధరలు…. ఆయా కంపెనీలు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్న మొత్తాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ విధానం ప్రకారం.. క్యూర్, ఫ్యూర్, రేర్ ప్రాంతాల్లో ఆయా సంస్థలకు భూములు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులకు సంబంధించిన అనుమతులు వేగంగా ఇవ్వాలని… అదే సమయంలో ఆయా కంపెనీలు పనులు త్వరగా ప్రారంభించేలా ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. ఎంవోయూలు కుదుర్చుకున్న కంపెనీలకు కేటాయించాల్సిన భూములకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కంపెనీలకు కల్పించాల్సిన సౌకర్యాలు, భవిష్యత్ అవసరాలకు సంబంధించి వివరాలను ముందుగానే తెలుసుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సీఎం అధికారులకు సూచించారు.
డాటా సెంటర్లకు ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నందున అందుకు తగినవిధంగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పెట్టుబడులుగా ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలను మూడు కేటగిరీలుగా విభజించాలని సీఎం సూచించారు. మల్టీనేషనల్, మార్కెట్‌లో పేరు ప్రతిష్టలున్న కంపెనీలకు మొదటి ప్రాధాన్యం ఇచ్చి ఆయా సంస్థలు త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలన్నారు. వేగంగా ఎదుగుతున్న కంపెనీలు, భవిష్యత్ లోనూ మంచి ప్రతిభ కనపర్చుతాయనుకునే సంస్థలకు తర్వాత ప్రాధాన్యం ఇవ్వాలని, మిగతా కంపెనీలను మూడో ప్రాధాన్యంగా ఎంచుకొని వాటి పెట్టుబడులు పట్టాలెక్కేలా ప్రేరణ కల్పించాలని సీఎం అధికారులకు సూచించారు. పెట్టుబడుల సాధనకు రాష్ట్రాల మధ్య ఉన్న పోటీతత్వాన్ని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండాలన్నారు..
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్‌దేవ్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- Telangana Liquor : తెలంగాణలో లిక్కర్ లవర్స్‌కు జాక్‌పాట్.. 121 కొత్త బ్రాండ్లు.!
- YS Jagan: జూనియర్ డాక్టర్ల సమ్మెపై వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
ఫ్యూచర్ సిటీలో కార్యాలయం పనులు త్వరగా పూర్తి చేసి అక్కడే ఎంవోయూల అమలు, పురోగతిపై నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పనులు పూర్తయిన కంపెనీల ప్రతినిధులతో చర్చించి వాటి ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. ఎప్పుడెప్పుడు ఏ ఏ ఎంవోయూలు కుదుర్చుకున్నాం.. అవి ఏ స్థితిలో ఉన్నాయి… అమలుకు ఉన్న ఆటంకాలు… వాటి పెట్టుబడి… కల్పించే ఉద్యోగాలు.. ఇలా ప్రతి అంశం సీఎంవో, ఆయా శాఖల మంత్రులు తెలుసుకునేలా డ్యాష్ బోర్డు ఏర్పాటు చేయాలని.. దానిలో రియల్ టైం అప్‌డేట్ ఉండాలని సీఎం ఆదేశించారు….
పెట్టుబడులకు సంబంధించి ఒక పూర్తి స్థాయి మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో అది పని చేసేలా చూడాలన్నారు. టైర్ 2, టైర్ 3 సిటీల్లో ఏర్పాటు చేసిన ఐటీ టవర్లలో కొనసాగుతున్న కార్యకలాపాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆయా టవర్లను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. పరిశ్రమలు, ఐటీ రంగాలకు సంబంధించి జైకా నిధులతో చేపట్టనున్న పనులపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఆయా పనులకు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు. సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, టీజీఐఐసీ ఎండీ కె.శశాంక, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి భవేష్ మిశ్రా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Nakshathra : లవ్ యూ నాన్న, లవ్ యూ అమ్మ
-
Ravi Teja: ‘ఇరుముడి’ సక్సెస్ జోష్.. ‘శివ నువ్వు తోపు సామీ’.. స్టేజ్ పైనే డైరెక్టర్‌ను హత్తుకున్న మాస్ మహారాజా!
-
Mythri Ravi: ఫోన్లో రీల్స్ చూసినా ఏడుపొస్తోంది.. ‘అన్నమయ్య’ తర్వాత మళ్లీ ఇప్పుడే..
-
Mythri Naveen: ఈ సినిమా చూసి 10 నిమిషాలు ఏడిచాను
-
Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్‌ఫోన్ కొనేముందు ఈ వాటర్‌ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!