CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుల స్ఫూర్తితో పాలన సాగిస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని హుగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… బసవేశ్వరుడి చూపిన మార్గం తెలంగాణ ప్రభుత్వానికి మార్గదర్శకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. వారి సిద్ధాంతాలను అనుసరిస్తూ సామాజిక న్యాయమని, సమానత్వంపై దృష్టి సారిస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు.…