NTV Telugu Site icon

CM Revanth: సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. మరిన్ని పెట్టుబడుల కోసం చర్చ

Satya Nadella

Satya Nadella

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇంటికి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి కూడా ఉన్నారు. అనంతరం.. సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. మైక్రోసాఫ్ట్ విస్తరణ అవకాశాలపై చర్చిస్తున్నారు. తమ వ్యాపారాన్ని విస్తరించాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ చాన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తోంది. రంగారెడ్డి జిల్లా నందిగామ ప్రాంతంలో 25 ఎకరాల భూమిని మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసింది. స్టాంప్ డ్యూటీ చెల్లించిన తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించిన లావాదేవీలు జరిగాయి. హైదరాబాద్‌లో డేటా సెంటర్ వ్యాపారాన్ని విస్తరించాలని చాన్నాళ్ల కిందట మైక్రో సాప్ట్ ప్లాన్ చేసింది.

Pawan Kalyan-Nagababu: నాగబాబుకు మంత్రి పదవి.. పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు!

ప్రస్తుతం మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మారిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డితో ఆయన భేటీ కావడం ఇదే తొలిసారి. కాగా.. ఈ సమావేశాన్ని గేమ్ ఛేంజర్‌గా భావిస్తోంది ఐటీ ఇండస్ట్రీ. తెలంగాణంలో మొత్తం 6 డేటా కేంద్రాలను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ డేటా సెంటర్లకు 32 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. రంగారెడ్డి జిల్లాలో మూడు చోట్ల మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో డేటా కేంద్రం 100 మెగావాట్ల ఐటీ లోడ్‌ కలిగి ఉంటుంది.

KTR: ఈడీ ఈ కేసులో అత్యుత్సాహం చూపిస్తుంది.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..

అలాగే.. మేకగూడలో 22 ఎకరాలు, షాద్‌నగర్‌లో 41 ఎకరాలు, చందన్‌వల్లిలో 52 ఎకరాలు కొనుగోలు చేసింది మైక్రోసాఫ్ట్. అంతేకాకుండా.. డేటా సెంటర్ల పనులు 70 శాతం పూర్తి కూడా అయ్యాయి. పనులు పూర్తయితే డేటా సెక్యూరిటీ, క్లౌడ్‌ సొల్యూషన్స్‌ రంగాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానానికి చేరనుంది. ఈ క్రమంలో.. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను కోరనున్నారు ముఖ్యమంత్రి.

Show comments