Site icon NTV Telugu

CM Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. పలు కీలకాంశాలపై చర్చ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి, రోడ్లు భవనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజనీర్ ఇన్ చీఫ్ గణపతి రెడ్డి, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర రహదారులపై సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, ఫ్లై ఓవర్ల నిర్మాణం, రీజినల్‌ రింగ్‌ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై గడ్కరీతో సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితోపాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు సమాచారం.

Read Also: Tirumala: తిరుమలలో భారీ జెర్రిపోతు.. భయంతో పరుగులు తీసిన భక్తులు

Exit mobile version