CM Revanth Reddy : ఆ స్థానాల్లో నిర్లక్ష్యం వహించవద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ జిల్లా పార్లమెంట్ అభ్యర్థులు, ఇన్చార్జ్ మంత్రులు, ఏఐసీసీ సెక్రెటరీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ నిర్వహించారు. జూమ్ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఏఐసీసీ సెక్రటరీలు, ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రేపు లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో వారికి పలు సూచనలు చేశారు. పోటాపోటీ ఉన్న నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండవద్దన్నారు.
కౌంటింగ్ సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు తర్వాతే ఈవీఎంల లెక్కింపు అవుతుందని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్లుగా పంపించాలని… సీనియర్ నాయకులను కూడా కౌంటింగ్ సెంటర్లకు తీసుకువెళ్లేలా చూడాలన్నారు. కౌంటింగ్ సమయంలో ప్రతి రౌండ్‌లోనూ జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరి దగ్గర 17సీ లిస్ట్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఈవీఎం ఓట్లకు, 17సీ లిస్ట్ ఓట్లకు తేడా వస్తే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. అభ్యర్థులందరికీ వీటన్నింటిపై అవగాహన ఉండాలన్నారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్‌లో ఇంగ్లండ్‌ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!