CM Revanth Reddy : భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే.. నేడు ఏడో రోజు వైభవోపేతంగా జరగుతున్న కోటి దీపోత్సవం వేడుకలకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులకు వేద మంత్రాలతో స్వాగతించగా, పూజలు నిర్వహించిన తరువాత, సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఏర్పాటు చేసిన కార్తీక దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ శైవ క్షేత్రంగా పరిగణించబడతుందని, ఈ శివుని దయతో రైతుల పంటలు బాగా పండుతున్నాయని, ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారని ఆయన అన్నారు.
Koti Deepotsavam 2024: ‘కోటి దీపోత్సవం’ వేడుకకు సీఎం రేవంత్.. స్వామివారికి హారతి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు భక్తిని పంచుతున్న ఈ కార్యక్రమం నిర్వహకులను అభినందిస్తూ, ఈ స్పూర్తితో రాష్ట్రంలో అన్ని గుళ్ళలో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమం ఆధ్యాత్మికత, భక్తితో నిండిన దృశ్యంగా తెలంగాణ ప్రజల మధ్య ఒక స్పూర్తి ప్రేరణను పంచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి సంవత్సరం కోటి దీపోత్సవం నిర్వహించడం గొప్ప యజ్ఞమని, ఈ యజ్ఞంలో వారు ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నానని ఆయన వ్యాఖ్యానించారు. పేద వారు దర్శించకోలేని స్వామిజీలను, సంప్రదాయాలను మన రాష్ట్రానికి తీసుకురావడం నిర్వాహకుల పట్టుదలకు నిదర్శనమన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
Kanguva : సూర్య కెరీర్ లో హయ్యెస్ట్ కలెక్షన్స్ ‘కంగువ’ సాదిస్తోంది : కేఈ జ్ఞానవేల్ రాజా