NTV Telugu Site icon

CM Revanth: బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయింది..

Revanth

Revanth

తెలంగాణలో 2023లో 64 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు .. మరో చోట సీపీఐని గెలిపించారు అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లు వచ్చాయి.. పార్లమెంట్ ఎన్నికల ముందే చెప్పిన ఈ ఎన్నిక.. మా పాలనకు రెఫరెండం.. మా పాలన నచ్చితే బలాన్ని ఇవ్వండి అని ఆడిగాం.. పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమ్మకంతో రెఫరెండం అని చెప్పినా.. పార్లమెంట్ ఎన్నికలో 8 సీట్లు మాకు ఇచ్చారు.. ఇంకో 8 బీజేపీకి ఇచ్చారు.. ఈ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు వచ్చాయి మాకు.. వంద రోజుల పాలన తర్వాత మమ్మల్ని ప్రజలు మెచ్చుకున్నారు.. అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వేశారు.. 2019లో 3 ఎంపీలు గెలిచాం.. ఇప్పుడు 8 సీట్లు ఇచ్చారు ప్రజలు.. 119 నియోజక వర్గాల్లో 64 సీట్లు వచ్చాయి.. 64 సీట్లలో మెజార్టీతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కూడా గెలిచామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Read Also: Balagam Mogilaiah: ‘బలగం’ మొగిలయ్యకు మరోసారి తీవ్ర అస్వ‌స్థ‌త‌.. ఆదుకోవాల‌ని భార్య కన్నీరు!

అలాగే, బీజేపీ గెలిచిన 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ 7 చోట్ల డిపాజిట్ కోల్పోయిందని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పారు. ఏడు చోట్ల బీజేపీని గెలిపీయించింది బీఆర్ఎస్.. వారి ఆత్మబలిదానాలు చేసి అవయవ దానం చేసింది బీజేపీకి.. నేను ఎన్నికలో ఇదే ఆరోపణ చేస్తే బీఆర్ఎస్ నాతో వితండవాదం చేసింది.. సిద్దిపేటలో ఏ ఎన్నిక జరిగినా అత్యధిక మెజార్టీ వచ్చేది.. కానీ హరీష్ రావు ఈ ఎన్నికల్లో ఓట్లను బీజేపీకి బదిలీ చేశాడు అని ఆరోపించారు. బీఆర్ఎస్ కు 65 వేల ఓట్లే వచ్చాయి.. బీఆర్ఎస్ కి 2500 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చాయి.. ఎప్పుడు లక్షకు తక్కువ మెజార్టీ వచ్చేది కాదు హరీష్ కి.. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రామిరెడ్డిని నమ్మించి హరీశ్ రావు మోసం చేశారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతో బీజేపీని గెలిపించి అవయవ దానం చేసింది బీఆర్ఎస్.. మెదక్ లో మాత్రమే బీఆర్ఎస్ కి డిపాజిట్ దక్కింది.. చస్తూ చస్తూ.. బీజేపీని కేసీఆర్ గెలిపించారంటూ రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

Read Also: Pawan Kalyan Win: ఇంకా మనల్ని ఎవరు రా ఆపేది.. టాలీవుడ్ హీరోయిన్ సంబరాలు!

39 మంది ఎమ్మెల్యే సీట్లలో బీఆర్ఎస్ గెలిచింది అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వెల్ లోనే బీఆర్ఎస్ కి లీడ్ వచ్చింది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆత్మగౌరవం బీజేపీకి తాకట్టు పెట్టారు.. ఫీనిక్స్ కాదు.. బూడిద అయ్యింది.. ఆ బూడిద మీ అయ్యకు, బావకు పుయ్యి కేటీఆర్ అని మండిపడ్డారు. చరిత్రలో పార్లమెంట్ లో స్థానం లేకుండా పోయింది.. కేసీఆర్, హరీష్, కేటీఆర్ ఆలోచన చేయండి.. వంద రోజుల పాలన మీద అస్థిరత చేయాలని చూశారు.. అలాగే, బీఆర్ఎస్ ను ప్రజలు తిరస్కరించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్.. బిడ్డ బెయిల్ కోసమో.. అక్రమ సంపాదన నుంచి బయట పడేందుకే బీజేపీతో కలిసి పోయాడన్నారు. ఇక, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో కూడా పాల్గొనకుండా అవమానం చేశారు ప్రజలను.. కేంద్రంలో బీజేపీ ఏక వ్యక్తి పేరుతో ఎన్నికలకు వెళ్ళింది.. మోడీ గ్యారంటీ 240 సీట్లకు పడిపోయింది.. మోడీ గ్యారంటికి కాలం చెల్లింది అంటూ సీఎం రేవంత్ వెల్లడించారు.