Revanht Reddy: జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం.. ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సైనిక స్కూల్ వరంగల్ నుండి ఎందుకు పోయిందో చెప్పమని అడగండి అన్నారు. బుల్లెట్ ట్రైన్ గురించి అడిగే వినోద్ రావు.. సైనిక స్కూల్ ఎందుకు తరలిపోయింది ఎందుకో చెప్పు? అని ప్రశ్నించారు. రేషన్ కార్డులు ఇస్తాం కొత్తవి అన్నారు. మేడిగడ్డ అన్నారం మీద విచారణ చేస్తున్నాం.. ముందుంది ముసళ్ళ పండగ.. అన్ని వసూలు చేస్తామన్నారు. అధికారిక సమాచారం వాళ్లకు ఇచ్చే వివరాలు కూడా ఉన్నాయన్నారు. మీదగ్గర ఉన్న వివరాలు కూడా ఇవ్వండి అని మీడియా మిత్రులకు రేవంత్ అన్నారు. అధికారం పోయిన విత్ డ్రాయల్ సింప్తం కేటీఆర్ దగ్గర కనిపిస్తోందన్నారు. మంచంకి కట్టేసే వైద్యం చేయించాల్సి వస్తుందని వ్యంగాస్త్రం వేశారు. టీఎస్పీఎస్ పై క్లారిటీ ఇస్తున్నామని తెలిపారు. ఉద్యోగాలు ఇవ్వాలి అంటే చైర్మన్ ఉండాలని.. కానీ.. అందరూ రాజీనామా చేశారని తెలిపారు. రాష్ట్రపతి అనుమతి గవర్నర్ కోరారని, వాటిని పరిశీలించి..చెప్తా అన్నారు. గందరగోళం కాకూడదని రాష్ట్ర ప్రజలకు సూచించారు.
Read also: Smriti Mandhana: అతడి కోసం ఎక్కువ సమయం కేటాయించలేను: స్మృతి మంధాన
నాలుగైదు రోజుల్లో గవర్నర్ నిర్ణయం ఇచ్చిన వెంటనే కమిటీ నియామకాలు జరుపుతామని అన్నారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ప్రజావాణికి ప్రత్యేక అధికారిని పెడతామన్నారు. రైతు బంధు డిసెంబర్24 నుండి మార్చి నెలాఖరు వరకు ఇచ్చారు వాళ్ళు.. రైతు బంధు సీలింగ్ పై అసెంబ్లీలో చర్చ చేస్తామని అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు. మెడిగడ్డలో ఎవరి పాత్ర ఎంత అనేది తేలుతుందన్నారు. ఖజానా అంతా ఊడ్చుకు పోయాడని మండిపడ్డారు. అందుకే శ్వేతపత్రం ఇచ్చామన్నారు. కేసీఆర్ నిండా ముంచి.. వదిలిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడెక్కడి నుండి నిధులు వస్తాయి అనేది.. చూస్తామన్నారు. కేంద్రం నుండి నిధులు ఆడిగామన్నారు. ఆటో డ్రైవర్ ల సమస్య ముందే గుర్తించామన్నారు. వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ని అమలు చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు.
Smriti Mandhana: అతడి కోసం ఎక్కువ సమయం కేటాయించలేను: స్మృతి మంధాన