NTV Telugu Site icon

CM Revanth Reddy : బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఎడ్యుకేషన్, ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారని, బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ అని, సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ అని రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ అని, పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారన్నారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుండి గాంధీ.. వల్లభాయ్ పటేల్ బయలుదేరారని, అదే గుజరాత్ నుండి.. మోడీ.. అమిత్ షా లు బయలు దేరారని, ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుంది… ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారన్నారు రేవంత్ రెడ్డి.

  బుల్లెట్‌ప్రూఫ్ ఫార్చ్యూనర్‌.. డీలర్‌షిప్ ద్వారా కస్టమర్లకు డెలివరీ!

అంతేకాకుండా..’బీఆర్ఎస్‌ సన్నాసులు బీజేపీ నీ ఎందుకు నిలదీయడం లేదు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందో.. మలినం అవుతుందో వాళ్ళ ఇష్టం. కేసీఆర్ ఎందుకు బీజేపీ దోపిడీ మీద ఎందుకు స్పందించడం లేదు. ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడరు. బీజేపీకి అనుకూలం కాబట్టే ఆయన స్పందించరు. జేసీసీ విషయంలో బీఆర్‌ఎస్‌ విధానం ఏంటి..? అమిత్ షా.. మోడీని మెప్పించడానికి రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్త అంటున్నారు. ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం అంటున్నారు. చెయ్ వేసి చూడు.. వీపు పగలకొట్టక పోతే పేరు మార్చుకుంట. తెలంగాణ కి తల్లి సోనియా గాంధీ. సచివాలయం బయట కాదు.. లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. పదేళ్లు ఈ సన్నాసులు ఎందుకు పెట్టలేదు తెలంగాణ తల్లి విగ్రహం. రైతుల ముసుగులో బీఆర్‌ఎస్‌ ధర్నా లు.

 Chiranjeevi: నీ అభిమానం సల్లగుండా.. పొర్లు దండాలు పెడుతూ తిరుమల మెట్లెక్కిన అభిమాని

ఏ రైతుకు మాఫీ కాకున్నా..కలక్టర్ కార్యాలయం లో కౌంటర్ పెట్టిన. 18 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశాం. కేటీఆర్… తప్పుడు మాటలు మానుకో మాది ప్రజా పాలన రైతులకు..ప్రజలకు అందుబాటులో ఉన్నాం. రోజూ మేము 18 గంటలు ప్రజల మధ్యనే ఉంటున్నాం. ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది. ప్రజల్ని పట్టించుకోకుండా ఉన్నారు మీరు. కాకుల లెక్క.. గద్దల లెక్క పిక్కుతున్నది వీళ్లే కదా. కేటీఆర్..హరీష్ లాంటి సన్నాసులు కదా మిమ్మల్ని దోచుకుంది. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నారు. పదేళ్లలో మీరు ఎంత మాఫీ చేశారు.. మేము ఎంత చేశామో చర్చకు సిద్దం. నెక్టు మా జగ్గన్న నే చూసుకుంటారు. సోషల్ మీడియా నీ నమ్ముకున్న మోడీ ఏమయ్యారు. మీరు అంతే ఐతరు 400 గెలుస్త అని మోడీ ప్రచారం చేసుకున్నారు..ఏమైంది. వచ్చే ఎన్నికల్లో 39 లో 9 కూడా రావు’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.