CM Delhi Tour: ఢిల్లీ బాట పట్టిన సీఎం రేవంత్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Delhi Tour: తెలంగాణ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ఢిల్లీకు వెళ్తున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పార్టీ అధిష్టానంతో కీలక చర్చలు జరపనున్నారు. రెండు ఖాళీల్లో ఒక సీటు ఇప్పటికే సీనియర్ నేత అభిషేక్ మను సింగ్వికు ఖరారైనట్లు సమాచారం. సింగ్వీ ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని స్థానిక నాయకులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అధిష్టానం నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది.
Laya : అలాంటి రోల్స్ వస్తే.. నాలోని మరో కోణాన్ని చూపిస్తా..
Also Read
మిగిలిన ఒక సీటు విషయంలో మాత్రం పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ సీటు కోసం పలువురు నేతలు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వి. హనుమంతరావు, వేమ నరేందర్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మాదిగ సమాజానికి అవకాశం ఇవ్వాలని ప్రముఖ దళిత నాయకుడు మంద కృష్ణ మాదిగ పార్టీ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం. సామాజిక సమీకరణలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన అనంతరం పరిస్థితి స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుండటంతో, రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
AP Legislative Council: నేటి నుంచి శాసనమండలి సమావేశాలు.. లడ్డూ అంశంపై మళ్లీ హాట్ టాపిక్!
తాజావార్తలు
-
Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. “నా బిడ్డకు దక్కిన వరం” అంటూ ఎమోషనల్ పోస్ట్!
-
The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. ‘ది ప్యారడైజ్’ షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
-
Pakistan: పాకిస్తాన్‌కు FATF భయం.. జైష్ చీఫ్ మసూద్ అజర్‌పై బౌంటీ పెంపు..
-
Srikanth Odela: ఒకప్పుడు సుకుమార్ శిష్యుడిగా.. ఇప్పుడు ఆయన కుర్చీలో డైరెక్టర్‌గా.. శ్రీకాంత్ ఓదెల లైఫ్ సర్కిల్ మూమెంట్!
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!