NTV Telugu Site icon

CM Revanth Reddy: వీరుల గ‌డ్డలో విద్రోహులు షిండే, అజిత్ ప‌వార్‌, అశోక్ చ‌వాన్‌..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

ఛ‌త్రప‌తి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్ అంబేడ్కర్‌, బాలా సాహెబ్‌, శ‌ర‌ద్ ప‌వార్ వంటి యోధులు నేల‌లో ఇప్పుడు ఏక్ నాథ్ షిండే, అజిత్ ప‌వార్‌, అశోక్ చ‌వాన్ వంటి విద్రోహులు త‌యార‌య్యార‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు గుజ‌రాత్ గులాంలుగా మారార‌ని అన్నారు. మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల ప్రచారంలో భాగంగా న‌యాగామ్‌, భోక‌ర్‌, నాందేడ్ ప్రచార స‌భ‌ల్లో ఆయ‌న ఆదివారం ప్రసంగించారు. అనంతరం సోలాపూర్‌లో విలేక‌రుల‌తో మాట్లాడారు. అబ‌ద్ధాల పోటీలు పెడితే దేశంలో నెంబ‌ర్ వ‌న్‌గా ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నిలుస్తార‌ని ముఖ్యమంత్రి విమ‌ర్శించారు. ఆటో డ్రైవ‌ర్‌గా ఉన్న ఏక్‌నాథ్ షిండేను మంత్రి వ‌ర‌కు బాలాసాహెబ్ కుటుంబం తీసుకువ‌చ్చింద‌ని.. సొంత కుమార్తెను కాద‌ని అజిత్ ప‌వార్‌ను శ‌ర‌ద్ ప‌వార్ ఉప ముఖ్యమంత్రి చేశార‌ని.. అశోక్ చ‌వాన్‌ ఆయ‌న తండ్రి శంక‌ర్ రావు చౌహాన్‌ను కాంగ్రెస్ పార్టీ.. గాంధీ కుటుంబం ముఖ్యమ‌ంత్రులుగా చేసింద‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

Read Also: Womens Asian Champions Trophy: లీగ్ దశలో జపాన్‌ను ఓడించి అగ్రస్థానంతో సెమీఫైనల్‌కు చేరుకున్న భారత్

ఆ ముగ్గురు విద్రోహులుగా మారి వీరుల నేల‌ను అవ‌మానాల‌పాలు చేశార‌ని సీఎం రేవంత్ మండిప‌డ్డారు. తెలంగాణ‌లో త‌మ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ. 18 వేల కోట్లను రైతుల రుణ‌మాఫీకి వారి ఖాతాల్లో వేసింద‌ని తెలిపారు. మ‌హారాష్ట్రలో కాంగ్రెస్‌ను గెలిపిస్తే రైతుల‌కు రూ. 3 ల‌క్షల వ‌ర‌కు రుణ‌మాఫీ చేస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు. తెలంగాణ‌లో రుణ‌మాఫీతో పాటు మ‌హిళ‌ల‌కు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండ‌ర్.. 200 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్ స‌ర‌ఫ‌రా చేస్తున్నామ‌ని తెలిపారు. కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేస్తున్న న‌యాగామ్ శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థి డాక్టర్ మీన‌ల్ పాటిల్ ఖ‌త్‌గావ్‌క‌ర్‌, భోక‌ర్ అభ్యర్థి తిరుప‌తి క‌ద‌మ్ కొందేక‌ర్‌, దక్షిణ సోలాపూర్ అభ్యర్థి చేత‌న్ న‌రొటే, నాందేడ్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌కు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి ర‌వీంద్ర చౌహాన్‌ల‌ను భారీ మెజారిటీతో గెలిపించాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Read Also: Minister Narayana: భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి త్వరలోనే కొత్త విధానం