CM Revanth: కమ్యూనిస్టుల పోరాటం.. కాంగ్రెస్ పరిష్కారం.! సీఎం కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth: నేడు రవీంద్రభారతిలో జరిగిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమ్యూనిస్టుల పోరాటాలపై తనకు అభిమానం ఉందని తెలిపారు. రైతు, కూలీల కోసం కమ్యూనిస్టులు పోరాటం చేశారని, ఆ సమస్యలకు పరిష్కారం చూపింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఇంకా.. దున్నే వాడికి భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని సీఎం పేర్కొన్నారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కాంగ్రెస్‌కే దక్కుతుందని అన్నారు. “పోరాటం కమ్యూనిస్టులది.. పరిష్కారం కాంగ్రెస్ పార్టీది” అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
మరోవైపు బీజేపీపై విమర్శలు చేస్తూ.. ప్రజలతో గెలవలేనప్పుడు సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఉపయోగించిందని ఆరోపించారు. ఇప్పుడు ఎస్ఐఆర్ (SIR)ను ఉపయోగిస్తున్నారని విమర్శించారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మైనార్టీల ఓట్లే కాకుండా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ఎస్సీ, ఎస్టీల ఓట్లను కూడా తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఓట్ల తొలగింపును అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రతిపక్షాలు ఇప్పటివరకు ఈ అంశంపై మాట్లాడటం లేదని అన్నారు.
Also Read
- Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
- Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
2029 ఎన్నికల్లో మోదీ ఓటమికి ఇవే తొలి అడుగులు అని సీఎం వ్యాఖ్యానించారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో అని ఆలోచించవద్దని.. 2026లోనే ఎవరు గెలవాలి.? ఎవరు ఓడిపోవాలి.? అనే విషయాన్ని బీజేపీ నిర్ణయించే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఎన్నికల సంఘం నిర్ణయించాల్సిన అంశాల్లో కూడా జోక్యం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. వందేళ్ల కమ్యూనిస్టు చరిత్రను తిరగేస్తే ఎర్రజెండా అంటే ప్రజలకు నమ్మకం, పేదలకు భరోసా అని రేవంత్ రెడ్డి అన్నారు. మిగిలిన జెండాలను ప్రజలు పాలకుల జెండాలుగా భావిస్తారని, ఎర్రజెండా కనిపిస్తే మాత్రం భరోసా కలుగుతుందని పేర్కొన్నారు.
కమ్యూనిస్టులు ఎన్నికల్లో గెలుస్తారా? ఓడిపోతారా? అనే లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదని సీఎం అన్నారు. ప్రజల ఓట్లను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని సూచించారు. కమ్యూనిస్టులు లేవనెత్తే సమస్యలకు సహేతుకమైన పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పాలమూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని ప్రస్తావించిన సీఎం.. సమస్యను లేవనెత్తేవారు పాలమూరు వారేనని, పరిష్కారం చేసేవారు కూడా పాలమూరు వారేనని అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి పేరుకు తగిన గౌరవం దక్కేలా ఏదో ఒక ప్రాంతానికి ఆయన పేరు పెట్టే అంశంపై మంత్రివర్గంలో చర్చిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?