CM Revanth Reddy: నన్ను మభ్యపెట్టడం అంత ఈజీ కాదు.. సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chief Minister Revanth Reddy: తనను మభ్యపెట్టడం అంత ఈజీ కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పరిపాలనలో కామన్ సెన్స్ అనేదే ముఖ్యమని.. కామన్ సెన్స్‌తో సమస్యలు పరిష్కారం చేసేవే ఎక్కువ అని తెలిపారు. తాజాగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను కేసీఆర్ మీడియా పీపుల్స్‌ను కూడా మీడియా సమావేశానికి పిలుస్తానన్నారు. వాళ్ళ మైండ్ సెంట్ ఏంటో తెలుసుకుంటానని చెప్పారు. తనకు వేరే ఏ పని లేదని.. 16 నుంచి 18 గంటలు పని చేస్తానన్నారు. తాను ఫుట్‌బాల్ ఆడతానని.. అందుకే మెస్సీని తీసుకువచ్చినట్లు తెలిపారు. యువతను క్రీడల వైపు మళ్లించాలనేది తన లక్ష్యమని చెప్పారు. తాను కొద్ది మంది జర్నలిస్ట్‌లతో రాత్రి సమయంలో మాట్లాడతానని, పాలనపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటా అన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసినా చూస్తానని, దాని నుంచి కూడా కొంత సమాచారం వస్తుందన్నారు. పేదలు చెరువు పరిసరాలు ఆక్రమించుకున్నారు అంటే అర్ధం చేసుకుంటానని.. కానీ పెద్ద వాళ్ళు కూడా చెరువులను అక్రమిస్తే ఎట్లా? అని ప్రశ్నించారు. హైడ్రా వచ్చాక.. ఎవరైనా ఇప్పుడు దైర్యం చేస్తారా అడగండి. చెరువు కబ్జా చేయడానికి ఆలోచన చేస్తారేమో అని నిలదీశారు.
ఓ వైపు క్యాస్టిజం వద్దంటం. మరో వైపు.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వేరే హాస్టల్స్ పెడుతుంటామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. “అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెడుతున్న. అందరూ అందులో చదువుకోవాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ అమలు చేసింది మేమే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయలేదు. ఓబీసీ జనాభా లెక్కలు కూడా లేవు. తెలంగాణలో ఆ లెక్కలు కూడా తేల్చేశాం. వెనకబాటు తనం, ఆర్ధిక పరమైన అంశమే కాదు. విద్యా, సామాజిక అంశాలు. మేము పేద విద్యా్ర్థులు చదువుకునే పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మేము పిల్లని ఇంటి నుంచి స్కూల్ వరకు వాహనాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ ఏడాది ప్రభుత్వం స్కూల్స్‌లో లక్ష మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. ట్రాన్స్‌పోర్టేషన్, బ్రేక్‌ఫాస్ట్, ఏర్పాటు చేస్తున్నాం. మా నాన్న రైతు. అందుకే మేము గోచి కడతాం పంచెలు, దోతీలు కూడా కడతాం. మా ఆహార్యం అలాగే ఉంటుంది. రాజశేఖర్ రెడ్డిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి. ఫ్రెండ్లీ మ్యాచ్ లాగే.. నా పొరుగు రాష్ట్రాలతో ఉంటా. హైడ్రా లాంటి ఆలోచన అన్ని రాష్ట్రాలకు అవసరం లేదు. మెట్రో పాలిటన్ సిటీలకు అవసరం. మహిళా రిజర్వేషన్కి మేం హక్కుదారులం. మహిళను రాష్ట్రపతి, ముఖ్యమంత్రులను చేసింది మేమే. సోనియా గాంధీ మహిళలకు రిజర్వేషన్ కోసం ప్రయత్నం చేశారు. మోడీ పొలిటికల్ ఫార్ములా వాడుతున్నారు. మేము నియోజకవర్గాల పెంపు, మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు. మోడీ చేస్తున్న ఆలోచనకి వ్యతిరేకం. తెలంగాణ, కర్ణాటకలో కూడా బీజేపీ ఎంపీలు గెలిచారు. కానీ కేంద్ర కేబినెట్లో ప్రధాన కేంద్ర మంత్రి పదవులు లేవు. ఢిల్లీలో దక్షణాది ఎంపీలు సెకండ్ గ్రేడ్ పీపుల్స్ లాగా చూడొద్దు అంటున్నాం.” అని సీఎం వ్యాఖ్యానించారు.
Also Read
- Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!