NTV Telugu Site icon

CM Revanth Reddy : తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్‌ కమిషన్‌

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు న్యాయపరమైన చిక్కులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్తో పాటు ఉన్నతాధికారులతో కలిసి ముఖ్యమంత్రి తన నివాసంలో సమాలోచనలు జరిపారు. రాష్ట్రంలో ఈనెల 6వ తేదీ నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని అభిప్రాయపడ్డారు.

Aishwarya Rai : పెళ్లికి ముందే మగబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్యరాయ్ .. షాకింగ్ విషయం వెలుగులోకి?

అందరి అభిప్రాయాల మేరకు వెంటనే బీసీ డెడికేటేడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను రేపటిలోగా జారీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కుల గణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో ఇటీవల హైకోర్టు లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం పున:సమీక్షించింది. అందరి ఏకాభిప్రాయంతో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి ఎలాంటి బేషజాలు లేవని, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలోనూ పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.

Black Magic: ఎన్టీఆర్ జిల్లాలో క్షుద్రపూజల కలకలం..

Show comments