CM Revanth Reddy: ఉమెన్స్ డే వేళ భారీ శుభవార్త చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వారందరికీ స్కూటీలు..
- ఉమెన్స్ డే సందర్భంగా శుభవార్త చెప్పిన సీఎం రేవంత్..
- చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు పంపిణీ చేస్తామని హామీ..
- డీజిల్ బస్సులను ఈ ఏడాది చివరికల్లా జిల్లాలకు తరలిస్తామన్న సీఎం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ విద్యార్థినులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీపి కబురు అందించారు. చదువుకునే అమ్మాయిల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. త్వరలోనే వారికి ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను పంపిణీ చేయనున్నట్లు ఆయన కీలక ప్రకటన చేశారు. ప్రజాభవన్‌లో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం, మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు..
మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థినుల సౌకర్యార్థం త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత బస్సు ప్రయాణంతో పాటు.. ఈ స్కూటీల పంపిణీ విద్యార్థినులకు విద్యాపరంగా ఎంతో తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
Also Read:Realme C83 5G: 7000mAh టైటాన్ బ్యాటరీతో రియల్మీ C83 5G.. బడ్జెట్లో బెస్ట్ లాంగ్ లైఫ్ ఫోన్!
హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. 2026 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో డీజిల్ బస్సులను పూర్తిగా తొలగించి.. వాటి స్థానంలో 100 శాతం ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని సీఎం తెలిపారు. నగరంలో తిరిగే డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి.. నగరం మొత్తం ఏసీ ఈవీ బస్సులతో నింపేస్తామని చెప్పారు.
ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారికి ‘జీరో ట్యాక్స్’ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెట్రోల్, డీజిల్ ఆటోలను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కేవలం రవాణా రంగానే కాకుండా.. ఆర్థికంగా కూడా మహిళలను బలోపేతం చేస్తున్నామని సీఎం గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన ద్వారా నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని.. కాలుష్య నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!